Girl’s body in bag: బడికి వెళ్ళిన 15 ఏళ్ళ బాలిక అదృశ్యం.. బ్రిడ్జి వద్ద బ్యాగులో ఆమె మృతదేహం లభ్యం
మహారాష్ట్రలోని పాల్గర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ళ ఓ అమ్మాయి మృతదేహం ఓ బ్రిడ్జి వద్ద బ్యాగులో కనపడింది. ఆమె మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వసయీ ప్రాంతంలోని ముంబై-అహ్మదాబాద్ రహదారి పక్కన నాయిగావ్ బ్రిడ్జికి సమీపంలో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు స్థానికులు ఓ బ్యాగును గుర్తించారని పోలీసులు చెప్పారు. అనుమానం వచ్చి తమకు సమాచారం అందించారని అన్నారు. దీంతో అక్కడకు వెళ్ళి బ్యాగును తెరచి చూడగా అందులో అమ్మాయి మృతదేహం కనపడిందని చెప్పారు.

Alabama shooting
Girl’s body in bag: మహారాష్ట్రలోని పాల్గర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ళ ఓ అమ్మాయి మృతదేహం ఓ బ్రిడ్జి వద్ద బ్యాగులో కనపడింది. ఆమె మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు. వసయీ ప్రాంతంలోని ముంబై-అహ్మదాబాద్ రహదారి పక్కన నాయిగావ్ బ్రిడ్జికి సమీపంలో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు స్థానికులు ఓ బ్యాగును గుర్తించారని పోలీసులు చెప్పారు. అనుమానం వచ్చి తమకు సమాచారం అందించారని అన్నారు.
దీంతో అక్కడకు వెళ్ళి బ్యాగును తెరచి చూడగా అందులో అమ్మాయి మృతదేహం కనపడిందని చెప్పారు. ఆమె మృతదేహంపై కత్తితో పొడిచిన గాయాలు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని చెప్పారు. ఆ అమ్మాయి ముంబైలోని అంధేరీ ప్రాంతంలో నివసించేదని గుర్తించినట్లు తెలిపారు.
ఆ అమ్మాయిని దుండగులు కిడ్నాప్ చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఇటీవలే అంధేరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని అన్నారు. సెక్షన్ 302 (హత్య) కింద కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఆ బాలిక పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారని అన్నారు. ఈ హత్యకేసును ఛేదించడానికి పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
COVID 19: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 9,520 మందికి కరోనా