Girl Murder : ఏడేళ్ల బాలిక కిడ్నాప్..నోటిలో రాళ్లు వేసి హత్య..నిందితుడి ఆచూకీ చెబితే రూ.50 వేలు బహుమతి
ఏడేళ్ల బాలిక కిడ్నాప్..నోటిలో రాళ్లు వేసి హత్య చేసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. నిందితుడి ఆచూకీ చెబితే రూ.50 వేలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

7 Years Girl Murder
7 year girl brutally murdered with stone : కిడ్నాపులు, అత్యాచారాలు, హింసలు. ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లల్ని కనటానికే భయపడిపోతున్నట్లుగా ఉన్నాయి సమాజంలో. ఆరేళ్ల ఆడపిల్లనే కాదు ఆరు నెలల పసిగుడ్డుల్ని కూడా వదలటంలేదు కామాంధులు. అలా దుర్మార్గుల దాష్టీకానికి మరో చిన్నారు అత్యంత పాశవికంగా ప్రాణాలు వదిలింది. ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా చంపేశారు. ఏడేళ్ల బాలికను నోట్లో రాళ్లు వేసి అమానుషంగా చంపేసిన ఘటన హర్యాణా రాష్ట్రంలో చోటుచేసుకుంది. అసలే రోజులు బాగా లేవు. ఓ పక్క బిడ్డ కనిపించట్లేదని తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు భయపడినదంతా జరిగింది. రెండు రోజుల క్రితం కనిపించకుండాపోయిన బిడ్డ దారుణ పరిస్థితుల్లో విగతజీవిగా కనిపించింది.
Read more :PM Modi: ప్రపంచంలోని ప్రశంసనీయ వ్యక్తుల్లో ఎనిమిదో స్థానంలో ప్రధాని మోదీ
హరియాణాలోని పానీపత్ జిల్లాలో రెండు రోజుల క్రితం (మంగళవారం, డిసెంబర్ 14,2021) కనిపించకుండాపోయింది. అంతే ఆ తల్లిదండ్రులు హడలిపోయారు. తమ బిడ్డకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని.. క్షేమంగా కనిపించాలని కోటి దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ వారి భయాలే నిజమయ్యాయి. అత్యంత దారుణ స్థితిలో విగతజీవిగా కనిపించింది బిడ్డ.
చనిపోయి కనిపించిన ఆ చిన్నారి నోటిలో చిన్న చిన్న రాళ్ల ముక్కలు ఉన్నాయి.
సమాలఖా గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి.. మనానా గ్రామంలో ఓ గుడి వద్ద ఆదివారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి వెళ్లింది. సాయంత్రం వరకు అక్కడే ఆడుకుంటూ ఉన్న బాలిక.. ఆ తర్వాత కనిపించకుండాపోయింది. దీంతో తల్లిదండ్రులు అందరిని అడిగారు. బంధువుల్ని చుట్టుపక్కలవారిని అందరిని తమ బిడ్డ గురించి అడిగారు. కానీ కనిపించలేదు.
Read more :Prakasam : బస్సులో ఎగ్జిట్ డోర్ ఎక్కడుందో డ్రైవర్‌కే తెలియదు
అలా రాత్రి అయిపోయింది. బిడ్డ జాడ తెలియలేదు. రాత్రికి ఇంటికి రాలేదు. కానీ ఎరుపు రంగు టూవీలర్ పై వచ్చిన ఓ వ్యక్తి చిన్నారిని తీసుకువెళ్లాడని ఆమెతో పాటు గుడి వద్ద ఆడుకుంటూ ఉన్న మిగతా పిల్లలు చెప్పారు. ఆ వ్యక్తి మాస్కు పెట్టుకున్నాడని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి కోసి గాలించారు. కానీ కనిపించలేదు.
అలా మంగళవారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని మనానా గ్రామంలోని ఓ స్టేడియం వద్ద ఉందనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా అక్కడకు వెళ్లారు. ఆ సమాచారాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. చిన్నారి నోట్లో రాళ్ల ముక్కలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుల సమాచారం తెలిపిన వారికి రూ.50,000 రివార్డు అందిస్తామని పానీపత్ ఎస్పీ ప్రకటించారు.