Pet Dogs Fight : ఓ మై గాడ్.. కుక్క కోసం గొడవ, ఇద్దరిని కాల్చి చంపేశాడు.. వీడియో వైరల్

కుక్క కోసం జరిగిన గొడవ దారుణానికి దారితీసింది. ఇద్దరు వ్యక్తుల చావుకి కారణమైంది. Pet Dogs Fight - Indore

Pet Dogs Fight : ఓ మై గాడ్.. కుక్క కోసం గొడవ, ఇద్దరిని కాల్చి చంపేశాడు.. వీడియో వైరల్

Pet Dogs Fight - Indore (Photo : Google)

Pet Dogs Fight – Indore : మనిషి విచక్షణ కోల్పోతున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు. అర్థం లేని ఆవేశంతో ఎదుటి వ్యక్తి ప్రాణం తీసేందుకు కూడా వెనకాడటం లేదు. మనిషిని మర్డర్ చేయడం మంచి నీళ్లు తాగినంత ఈజీగా మారిపోయింది కొందరికి. ముందు వెనకా ఆలోచన చేయడం లేదు.

ఆవేశంలో హత్యలు చేసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో నిత్యం ఎక్కడో ఒకచోట నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయి. తాజాగా కుక్కల కోసం జరిగిన గొడవ దారుణానికి దారితీసింది. ఇద్దరు వ్యక్తుల చావుకి కారణమైంది. చిన్నపాటి గొడవ కాల్చి చంపే వరకు వెళ్లింది.

మధ్యప్రదేశ్ ఇండోర్ లో భయానక ఘటన చోటు చేసుకుంది. కుక్కల కోసం వాటి యజమానులు ఘర్షణ పడ్డారు. ఇది కాస్తా చంపుకునే వరకు వెళ్లింది. తొలుత రెండు కుక్కలు ఘర్షణ పడ్డాయి. ఆ తర్వాత వాటి యజమానులు గొడవ పడ్డారు. వారిలో ఒక వ్యక్తి బ్యాంకు ఆఫ్ బరోడా సెక్యూరిటీ గార్డు రాజ్ పాల్ రజావత్ ఉన్నాడు.

కోపంతో రగిలిపోయిన అతడు తన సర్వీస్ గన్ తో పొరుగు వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సెక్యూరిటీ గార్డు రాజ్ పాల్ తన ఇంట్లో నుంచి గన్ తో కాల్పులు జరిపిన దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు. మరీ ఇంత దారుణమా? అని నివ్వెరపోతున్నారు. కుక్క కోసం మనిషులను చంపడం దారుణం అంటున్నారు.

Also Read..Beer : షాకింగ్.. కింగ్ ఫిషర్ బీర్‌లో నిషేధిత రసాయనం, తాగితే ప్రాణాలకే ప్రమాదం, వెంటనే అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశం

సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న రాజ్ పాల్ తన పెంపుడు కుక్కను తీసుకుని రాత్రి 11 సమయంలో వాకింగ్ కి వెళ్లాడు. అదే సమయంలో రాజ్ పాల్ పొరుగింట్లో ఉండే విమల్ కూడా తన కుక్కతో వచ్చాడు. ఈ క్రమంలో రెండు కుక్కలు ఘర్షణ పడ్డాయి. ఆ తర్వాత కుక్కల యజమానుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన సెక్యూరిటీ గార్డు తన ఇంట్లోకి వెళ్లి గన్ తో బయటకు వచ్చాడు. తన ఇంటి బాల్కనీలో నిల్చుని మరో కుక్క యజమాని కుటుంబంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. గురువారం రాత్రి ఈ ఘోరం జరిగింది. పోలీసులు సెక్యూరిటీ గార్డుని అరెస్ట్ చేశారు. కాల్పులు జరిపేందుకు అతడు వాడిన గన్ ని సీజ్ చేశారు. అతడి గన్ లైసెన్స్ కూడా రద్దు చేసేశారు. అతడు స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తాడు. రజావత్ తో పాటు అతడి కొడుకు సుధీర్, బంధువు శుభ్ మన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రజావత్ పై మర్డర్ కేసు నమోదు చేశారు.

కాగా, రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వైరం లేదని పోలీసులు చెబుతున్నారు. కేవలం పెంపుడు కుక్కల కోసం జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసిందన్నారు. సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో విమల్(35), రాహుల్ వర్మ(28) చనిపోయారు. రాహుల్ వర్మ విమల్ కు బావ అవుతాడు. కాల్పుల్లో రాహుల్ వర్మ భార్య జ్యోతి వర్మ కూగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్.

Also Read..Pakistan Zindabad : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు, పిచ్చకొట్టుడు కొట్టిన జనాలు.. సినిమా థియేటర్‌లో ఒక్కసారిగా కలకలం, వైరల్ వీడియో

”రెండు కుక్కలు గొడవ పడ్డాయి. ఈ క్రమంలో విమల్ తమ్ముడు ప్రమోద్ కర్రతో రజావత్ కుక్కను తరిమాడు. ఈ విషయమై రజావత్, విమల్ మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. తన ఇంట్లోకి ఆవేశంగా వెళ్లిన రజావత్ గన్ తో తన ఇంటి బాల్కనీలోకి వచ్చాడు. తొలుత గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత రోడ్డు మీద గుమిగూడిన వారిపై కాల్పులు జరిపాడు. చూస్తుండగా దారుణం జరిగిపోయింది. ఇద్దరి ప్రాణాలు పోయాయి” అని ప్రత్యక్ష సాక్షి వాపోయారు.