నెల జీతమంతా తనకే ఇవ్వాలంటూ.. భార్యపై భర్త పైశాచికం
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు కొద్దిరోజులకే తన పైశాచిక ప్రవృత్తిని బయటపెట్టాడు. భార్య నెల జీతమంతా తనకే ఇవ్వాలంటూ ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు కొద్దిరోజులకే తన పైశాచిక ప్రవృత్తిని బయటపెట్టాడు. భార్య నెల జీతమంతా తనకే ఇవ్వాలంటూ ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు.
భార్య నెల జీతమంతా తనకే ఇవ్వాలంటూ ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు కొద్దిరోజులకే తన పైశాచిక ప్రవృత్తిని బయటపెట్టాడు. జీతమంతా తనకే ఇవ్వాలంటూ ఆమెను వేధించడం ప్రారంభించాడు. భార్యతోపాటు ఆమె తల్లిని కించపరుస్తూ బంధువులకు ఫోన్లు చేస్తున్నాడు. తన భార్య, అత్త, భార్య సోదరి ఫొటోల కింద అసభ్యకరమైన వ్యాఖ్యలను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న మాలతి (పోలీసులు పేరు మార్చారు) తన సహచరుడిని ఏడాదిన్నర క్రితం ప్రేమ పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక కూడా తన తల్లి, సోదరికి సాయంగా ఉంటానని, జీతంలో సగం వారికి ఇస్తానంటూ పెళ్లికి ముందు చెప్పింది. ఈ షరతుకు అంగీకరిస్తేనే పెళ్లి చేసుకుందామంటూ చెప్పింది. అందుకు యువకుడు ఒప్పుకొన్నాడు. పెళ్లైన రెండు నెలలకే అతడు బెంగళూరుకు బదిలీ అయ్యాడు. భర్త కోసం ప్రతి పదిహేను రోజులకోసారి ఆమె బెంగళూరుకు వెళ్లేది. ఆరు నెలల తర్వాత ఆమె కూడా బెంగళూరుకు బదిలీ చేయించుకుంది. ఆమె వెళ్లిన కొద్దిరోజులకే నెల జీతమంతా తనకు ఇవ్వాలంటూ హెచ్చరించాడు. ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు.
భార్య తనకు నెలజీతం ఇవ్వకపోవడంతో భర్త ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే పనులు మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో తాను, తన భార్య, స్నేహితులు వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోలను తన భార్య, ఆమె స్నేహితుల ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్ట్ చేసి.. వీరంతా దేశముదుర్లు అంటూ వ్యాఖ్యలను ఉంచేవాడు. తన భార్య, అత్త ఫొటోలను ఉంచి.. మీకు సాయంత్రాల్లో బోర్ కొడుతుందా… వీరిని సంప్రదించండి అంటూ వ్యాఖ్యలను చేసేవాడు. ఇక తన భార్య ఫేస్ బుక్ ఖాతాలో ఆమె కుటుంబాన్ని కించపరిచే వ్యాఖ్యానాలు పోస్ట్ చేశాడు. తన భర్త పైశాచికత్వాన్ని భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.