Extra Marital Affair : భార్య ప్రవర్తనపై అనుమానం…అత్త,భార్యను నరికి చంపిన వ్యక్తి
భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వ్యక్తి భార్య, అత్తను, దారుణంగా నరికి చంపాడు. కర్నాటక లోని శివమొగ్గ జిల్లా తీర్ధహళ్లికి చెందిన రవికుమార్, అతనిభార్య సావిత్రి, అత్త సరోజమ్మలతో కల

karnataka Murder
Karnataka : భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వ్యక్తి భార్య, అత్తను, దారుణంగా నరికి చంపాడు. కర్నాటక లోని శివమొగ్గ జిల్లా తీర్ధహళ్లికి చెందిన రవికుమార్, అతని భార్య సావిత్రి, అత్త సరోజమ్మలతో కలిసి బెంగుళూరులోని మూడలపాళ్యలో నివసిస్తున్నాడు.
వీరు 20 ఏళ్ల క్రితం బెంగుళూరుకు వలస వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా సావిత్రికి వేరోకవ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త రవి కుమార్ భార్యను వేధించసాగాడు. ఈ విషయమై దంపతులిద్దరూ పలు మార్లు ఘర్షణ పడ్డారు.
Also Read : Gang Rape In Telangana : మహబూబాబాద్ జిల్లాలో గ్యాంగ్ రేప్
భార్య ప్రవర్తనపై అనుమానంతో పలుమార్లు ఇళ్ళుకూడా మార్చాడు. మంగళవారం ఉదయం పిల్లల్ని స్కూల్ వద్ద దింపి వచ్చి మళ్లీ భార్య ప్రవర్తనపై గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో ఆవేశం పట్టలేక పక్కనే ఉన్న కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో భార్య సావిత్రి, ఆమె తల్లి సరోజమ్మను నరికి చంపాడు. తరువాత స్కూటర్ పై గోవిందరాజ నగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.