Woman Cheating : చిట్టీల పేరుతో రూ.12 కోట్ల మోసం చేసిన మహిళ

హైదరాబాద్ వనస్ధలిపురంలో ఒక మహిళ చిట్టీల పేరుతో 12 కోట్ల రూపాయల మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.

Woman Cheating : చిట్టీల పేరుతో రూ.12 కోట్ల మోసం చేసిన మహిళ

VanasthaliPuram Police Station

Updated On : November 28, 2021 / 1:38 PM IST

Woman Cheating : హైదరాబాద్ వనస్ధలిపురంలో ఒక మహిళ చిట్టీల పేరుతో 12 కోట్ల రూపాయల మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటరమణ కాలనీలో నివసించే కోన విజయలక్ష్మి అనే మహిళ ప్రైవేట్ గా చిట్టీలు నిర్వహిస్తూ ఉండేది.

అధిక వడ్డీ ఇస్తానని చెప్పి దాదాపు 45 మంది వద్ద నుండి 12 కోట్ల రూపాయలు  తీసుకుంది. ఇటీవల కొద్దిరోజులుగా ఆమె ఇంటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమెకు డబ్బులు ఇచ్చిన వారికి అనుమానం కలిగింది. మహిళకు ఫోన్ చేయగా ఫోన్ స్విఛ్చాఫ్ రావటంతో భాదితులు కోన విజయ లక్ష్మి ఇంటి ముందు ధర్నాకు దిగారు.
Also Read : Rains warning: ఏపీకి హెచ్చరిక.. అతి భారీ వర్షాలు పడే అవకాశం!
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటి వద్దకు వచ్చి బాధితుల వద్దనుంచి ఫిర్యాదు తీసుకున్నారు. విజయలక్ష్మిపై  ఐపీసీ సెక్షన్ 420, 406,  5 TS PDFEA కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.