డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది : స్టీఫెన్ రవీంద్ర

డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 08:07 AM IST
డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది : స్టీఫెన్ రవీంద్ర

డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.

హైదరాబాద్ : డేటా చోరీ కేసులో విచారణ వేగవంతం అయింది. మాదాపూర్ ఐటి గ్రిడ్స్ కార్యాలయంలో సిట్ బృందం సోదాలు నిర్వహిస్తోంది. సీజ్ చేసిన ఐటి గ్రిడ్స్ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. క్లూస్ టీంతో మరోసారి సోదాలు చేస్తోంది. స్టీఫెన్ రవీంద్ర, సిట్ సభ్యులు శ్వేతారెడ్డి, రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిట్ ఇంఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ డేటా చోరీ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందని అన్నారు. 

ఐటీ గ్రిడ్స్ కంపెనీలో సోదాలు నిర్వహించామని తెలిపారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మాదాపూర్ ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నామని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న డేటాను ఎఫ్ఎస్ఎల్ కు పంపామని చెప్పారు. ఐటీ నిపుణుల సహాయంతో డేటా డీకోడ్ చేస్తున్నామని వివరించారు. హైకోర్టులో అశోక్ వేసిన క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. పిటిషన్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. అమెజాన్‌ నుంచి ఐటీగ్రిడ్స్‌కు చెందిన డేటా రావాల్సి ఉందని తెలిపారు. పోలీసులు సీజ్‌ చేసిన పత్రాలను న్యాయస్థానానికి సమర్పిస్తామని చెప్పారు. ఫామ్‌-7 దరఖాస్తులపై ఏపీ సిట్‌ మమ్మల్ని సంప్రదించలేదని పేర్కొన్నారు.