Karimnagar : రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య.. పరారీలో సీఐ గోపీకృష్ణ

Karimnagar : ఓ భూమి విషయంలో ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ తనను వేధిస్తున్నారని సూసైడ్ నోట్ లో రాసి సాంబయ్య ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ వేధింపులు తాళలేక వ్యాపారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది.

Karimnagar : రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య.. పరారీలో సీఐ గోపీకృష్ణ

Karimnagar

Updated On : April 23, 2023 / 5:27 PM IST

Karimnagar : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి బొడిగే శ్యామ్ అలియాస్ సాంబయ్య ఆత్మహత్యపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. తన మరణానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ సీఐ గోపీకృష్ణ కారణమని సాంబయ్య సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సాంబయ్య ఆత్మహత్య తర్వాత సీఐ గోపాలకృష్ణ పరారీలో ఉన్నాడు. సీఐపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఓ భూమి విషయంలో సీఐ గోపీకృష్ణ తనను వేధిస్తున్నాడని సాంబయ్య వాపోయాడు.

Also Read..Karimnagar : కరీంనగర్ జిల్లాలో దారుణం.. సీఐ వేధింపులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

ఓ భూమి విషయంలో ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ తనను వేధిస్తున్నారని సూసైడ్ నోట్ లో రాసి సాంబయ్య ఆత్మహత్య చేసుకున్నారు. సీఐ వేధింపులు తాళలేక వ్యాపారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. ఇక, సాంబయ్య సూసైడ్ నోట్ వైరల్ అయ్యింది. సాంబయ్య కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Also Read..Ice Cream : బాబోయ్.. ఐస్‌క్రీమ్ తిని బాలుడు మృతి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

ఈ ఘటన తర్వాత సీఐ గోపీకృష్ణ.. పోలీసులకు కానీ, ఇతరులకు కానీ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో అతడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. గోపీకృష్ణ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. భూమి విషయంలో గోపీకృష్ణ ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డాడు అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి.