AK-47 rifles: ఆర్మీ క్యాంపు నుంచి రెండు ఏకే-47 గన్స్ మాయం.. కొనసాగుతున్న విచారణ

భారత సైన్యంలోని ప్రత్యేక విభాగమైన ఐటీబీపీకి చెందిన క్యాంపు నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు కనిపించకుండా పోయాయి. 45వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు పోలీసుల రైఫిళ్లు ఇవి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

AK-47 rifles: ఆర్మీ క్యాంపు నుంచి రెండు ఏకే-47 గన్స్ మాయం.. కొనసాగుతున్న విచారణ

AK-47 rifles: భారత సైన్యంలోని ప్రత్యేక విభాగానికి చెందిన రెండు ఏకే-47 రైఫిళ్లు కనిపించకుండా పోయాయి. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లతో ఒక క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇక్కడ యాంటీ నక్సల్ ట్రైనింగ్ జరుగుతోంది. 45వ బెటాలియన్‌కు చెందిన రాజేష్ కుమార్, సందీప్ మీనా అనే ఇద్దరు పోలీసులకు చెందిన ఏకే-47 రైఫిళ్లను బుధవారం సాయంత్రం అక్కడి బ్యారక్‌లో డిపాజిట్ చేశారు.

Munawar Faruqui: మునావర్ షోకు అనుమతి నిరాకరణ.. ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్

అయితే, అవి కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం ఇద్దరూ తమిళనాడులోని మధురైలో ఉన్నారు. ఇండియన్ ఆర్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న కాకతి పోలీసులు రైఫిళ్లు ఎవరు ఎత్తుకెళ్లారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, విచారణ జరుపుతున్నట్లు డీసీపీ పీవీ స్నేహ తెలిపారు.