కేరళలో వైఫ్ స్వాపింగ్..నలుగురు అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : April 30, 2019 / 11:03 AM IST
కేరళలో వైఫ్ స్వాపింగ్..నలుగురు అరెస్ట్

Updated On : April 30, 2019 / 11:03 AM IST

కేరళలో వైఫ్ స్వాపింగ్ కల్చర్ మొదలైంది.యూరప్ లోని చాలా దేశాల్లో పార్టీల సమయంలో పరస్పర అంగీకారంతో ఒకరి భార్యతో మరోకరు సెక్స్ చేస్తుంటారు.దీన్నే వైప్ స్వాపింగ్ అంటారు. ఈ కల్చర్ ఇప్పుడు కేరళలో పెరిగిపోతుంది. లైంగిక ఆనందం కోసం భార్యలను మార్చుకుంటున్న నలుగురు వ్యక్తులను కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొత్త వారితో సెక్స్ లో పాల్గొనాలని తన భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన కంప్లెయింట్ తో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు నలుగురు పెళ్లైన వ్యక్తులను అలప్పుజా జిల్లాలోని కయంకుళం పోలీసులు అరెస్ట్ చేశారు.

కంప్లెయింట్ ఆధారంగా బాధితురాలి భర్తతో పాటు నలుగురిని అరెస్ట్‌ చేసి, ఐపీసీ 366 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో కిరణ్‌, సీది, ఉమేశ్‌, బ్లెసరిన్‌ ఉన్నారని తెలిపారు. కొంత కాలంగా గుట్టుచప్పుడుగా సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న ఈ వ్యవహారం రట్టు కావడంతో కేరళలో కలకలం రేగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మార్చి-2019లో కేరళలో ‘వైఫ్‌ స్వాపింగ్‌’  ప్రారంభమైంది. సోషల్‌ మీడియా యాప్‌ ‘షేర్‌ చాట్‌’లో పరిచయమైన కాలికట్‌ కు చెందిన అర్షద్‌ అనే వ్యక్తితో ఏకాంతంగా గడపాలని తన భర్త వేధించాడని,తన భర్త ఆజ్ణతో అర్షద్ తనపై అనేకసార్లు రేప్ కు పాల్పడ్డాడని బాధితురాలు కంప్లెయింట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.