Producer Bellamkonda Suresh: బెల్లంకొండ కారులో చోరీ.. మద్యం సీసాలు మాయం.. ఒక్కో సీసా ఖరీదు ఎంతో తెలుసా?
నగదు, మద్యం సీసాలు చోరీకి గురికావడంతో కార్యాలయం సిబ్బంది, సురేష్ సతీమణి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Producer Bellamkonda Suresh
Bellamkonda Suresh సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Film producer Bellamkonda Suresh) కారులో చోరీ (Car theft) జరిగింది. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు అద్దం పగులగొట్టి కొంత నగదు, ఖరీదైన మద్యం సీసాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం సీసాల విలువ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుందని తెలిసింది.
Bellamkonda Sreenivas : బాలీవుడ్ పై బెల్లంకొండ ప్రశంసలు.. ప్రతి నటుడికి హిందీ సినిమానే ఏకైక మార్గం..
జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని బెల్లంకొండ సురేష్ అలియాస్ సురేంద్ర చౌదరికి సాయిగణేష్ ప్రొడక్షన్స్ పేరుతో కార్యాలయం ఉంది. గురువారం మధ్యాహ్నం సురేష్‌కు చెందిన బెంజి కారును కార్యాలయం ముందు నిలిపారు. శుక్రవారం ఉదయం చూడగా కారు ఎడమవైపు వెనుక సీటువద్ద అద్దం పగిలి ఉంది. వెళ్లి చూడగా.. లోపల ఉంచిన రూ.50వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు కనిపించలేదు. ఈ మద్యం సీసాల ఖరీదు వెయ్యి, రెండువేలు కాదు.. ఏకంగా ఒక్క మద్యం సీసా రూ. 28వేలు ఉంటుందని సమాచారం.
నగదు, మద్యం సీసాలు చోరీకి గురికావడంతో కార్యాలయం సిబ్బంది, సురేష్ సతీమణి పద్మావతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.