Murder Attempt : పెళ్లిలో గొడవ…యువకుడికి కత్తిపోట్లు

వికారాబాద్ జిల్లాలో పెళ్లి ఇంట్లో దారుణం జరిగింది. పెళ్లికూతురు ఎదుర్కోలు ఉత్సవంలో జరిగిన గొడవలో యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు.

Murder Attempt : పెళ్లిలో గొడవ…యువకుడికి కత్తిపోట్లు

Murder Attempt

Updated On : June 2, 2021 / 8:31 PM IST

Murder Attempt :  వికారాబాద్ జిల్లాలో పెళ్లి ఇంట్లో దారుణం జరిగింది. పెళ్లికూతురు ఎదుర్కోలు ఉత్సవంలో జరిగిన గొడవలో యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. జిల్లాలోని కుల్కచర్ల మండలం ఘోరిగడ్డ తండాలో ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. లాక్‌డౌన్ నిబంధనలు గాలికి వదిలేసి పెళ్లికి వచ్చిన యువకులు మద్యం సేవించి.. డీజే పెట్టుకుని పాటలకు డ్యాన్సులు  చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

వివాహ తంతులో భాగంగా పెళ్లికూతురు ఎదుర్కోలు ఉత్సవం ప్రారంభమయ్యింది. ఈసమయంలో  మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ మొదలైంది.  సంజయ్ అనే యువకుడు రాహుల్ అనే యువకుడిని కత్తితో పొడిచాడు. గాయాలపాలైన రాహుల్‌ను వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం యువకుడిని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పెళ్లిమండపం వద్దకు వచ్చి కత్తితో దాడి చేసిన సంజయ్‌తో పాటు గొడవకు కారణమైన మరో ఇద్దర్ని అదుపులోకి  తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.