Bengaluru: అడగకుండా ఇయర్‌ఫోన్స్ వాడుకున్నందుకు స్నేహితుడి హత్య

కొత్త సంవత్సరం సందర్భంగా కార్తీక్, రజనీష్, రవి, మిగతా ఇద్దరు కలిసి శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఐదుగురు కలిసి మందు తాగారు. అనంతరం బిల్డింగులోనే నిద్ర పోయేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి నిద్రపోయే ముందు మ్యూజిక్ వినడం రజనీష్‌కు అలవాటు.

Bengaluru: అడగకుండా ఇయర్‌ఫోన్స్ వాడుకున్నందుకు స్నేహితుడి హత్య

Updated On : January 3, 2023 / 9:33 PM IST

Bengaluru: కర్ణాటక, బెంగళూరులో దారుణం జరిగింది. అనుమతి లేకుండా ఇయర్‌ఫోన్స్ వాడుకున్నందుకు స్నేహితుడిని కొట్టి చంపారు నలుగురు వ్యక్తులు. ఈ ఘటన బెంగళూరులోని దొడ్డనమంగళ ప్రాంతంలో గత శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన కార్తీక్ కుమార్ బెంగళూరులో పెయింటర్‌గా పని చేస్తున్నాడు.

Gayathri Raghuram: అన్నామలై నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు: తమిళనాడు నేత గాయత్రి రఘురాం

రజనీష్, రవితోపాటు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో ఉంటున్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా కార్తీక్, రజనీష్, రవి, మిగతా ఇద్దరు కలిసి శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఐదుగురు కలిసి మందు తాగారు. అనంతరం బిల్డింగులోనే నిద్ర పోయేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి నిద్రపోయే ముందు మ్యూజిక్ వినడం రజనీష్‌కు అలవాటు. ఈ క్రమంలో మ్యూజిక్ వినేందుకు తన ఇయర్‌ఫోన్స్ కోసం వెతికాడు. అయితే, అవి చాలాసేపు కనబడలేదు. కొద్దిసేపటి తర్వాత కార్తీక్ కుమార్ ఆ ఇయర్‌ఫోన్స్ వాడుతూ కనిపించాడు. దీంతో కోపం తెచ్చుకున్న రజనీష్ తన ఇయర్‌ఫోన్స్ ఎందుకు వాడుతున్నావని ప్రశ్నించాడు. తన అనుమతి లేకుండా ఎందుకు తీసుకున్నావని అడిగాడు.

Jaydev Unadkat: రంజీట్రోఫీలో జయదేవ్ ఉనద్కత్ సంచలనం.. మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్

దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇది పెద్ద గొడవకు దారి తీసింది. రజనీష్, రవితోపాటు మిగతా ఇద్దరూ కలిసి కార్తీక్ కుమార్‌పై దాడి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. అదే బిల్డింగులో నిద్రిస్తున్న మరో వ్యక్తి ఈ గొడవ విని లేచాడు. గొడవ పడొద్దని సూచించాడు. దీంతో అందరూ గొడవ ఆపేసి నిద్రపోయారు. తీరా తెల్లారేసరికి కార్తీక్ లేవలేదు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరికోసం పోలీసులు గాలిస్తున్నారు.