Telangana : గ్రామదేవత దున్నపోతు పొడవటంతో వ్యక్తి మృతి
గ్రామదేవత కోసం వదిలిన దున్నపోతు దాడి చేయటంతో ఒక వ్యక్తి మరణించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

Telangana
Telangana : గ్రామదేవత కోసం వదిలిన దున్నపోతు దాడి చేయటంతో ఒక వ్యక్తి మరణించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని యాలాల మండలం బాణాపూర్ గ్రామంలో గ్రామ దేవత కోసం ఒక దున్నపోతును గ్రామస్తులు గ్రామంలో వదిలి పెట్టారు.
శనివారం ఉదయం అది గ్రామంలో సంచరిస్తోంది. ఆ సమయంలో గ్రామానికి చెందిన పాండు నాయక్ అనే వ్యక్తిపై పోతు దాడికి దిగింది. రెండు కాళ్ల మధ్య పోటేయడంతో పాండు నాయక్ కొద్దిసేపటికే అక్కడ కుప్పకూలి మరణించాడు. ఈసంఘటన స్ధానికంగా విషాదం నింపింది.