Lovers Died : ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

హైదరాబాద్ మాదాపూర్ లో ప్రేమ పేరుతో ప్రియురాలిని చంపి ఓ ప్రియుడు తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

Lovers Died : ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

Lovers Died

Updated On : July 30, 2021 / 2:25 PM IST

Lovers Died : హైదరాబాద్ మాదాపూర్ లో ప్రేమ పేరుతో ప్రియురాలిని చంపి ఓ ప్రియుడు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం హకీంపేటకు చెందిన రాములు(25) లగిచెర్ల గ్రామనానికి చెందిన సంతోషి(25) లు 10 వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇద్దరూ చాలాకాలంగా ప్రేమించికుంటున్నారు.

బుధవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి మాదాపూర్ లోని లెమన్ ట్రీ హోటల్ లో ఒక గది అద్దెకు తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ జరగటంతో ఆమెను బ్లేడుతో గొంతుకోసి హత్య చేసి బాత్ రూం లో శవాన్ని పడేశాడు. ఆతరువాత ఆమె చున్నీతోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసుల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.