యువతిపై అత్యాచారం : ఆపదలో కాపాడిన వారే కాటేశారు

ఉద్యోగం ఉందని చెప్పిన వ్యక్తి సాయం చేయక పోగా బలాత్కరించాడు. తీరా అతడి నుంచి కాపాడిన కామాంధులు కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ దారుణం నోయిడాలోజరిగింది. పోలీసులు తెలిపిన వివిరాల ప్రకారం నోయిడాకు చెందిన బాధిత యువతి (21) ఉద్యోగాల వేటలో ఉంది. ఆమెకు రవి అనే వ్యక్తతో పరిచయం ఉంది. రవి ఒక ఎక్స్ పోర్టు కంపెనీలో ప్యూన్ గా పని చేస్తున్నాడు. తనకు తెలిసిన చోట ఉద్యోగ అవకాశం ఉంది రమ్మని రవి బాధిత యువతికి చెప్పాడు. ఉద్యోగ విషయమై చర్చించేందుకు తన ఇంటికి రమ్మన్నాడు.
అతనిమాటలు నమ్మి సెక్టార్ 63లోనిల రవి ఇంటికి వెళ్లిన యువతిని అక్కడి నుంచి పార్క్ కు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను బలాత్కరించబోయాడు. ఆమె అరుపులువిన్న గుడ్డూ, షామూ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను రవిని చితకబాది అతడి బారినుంచి యువతిని కాపాడారు. దీంతోరవి అక్కడి నుంచి పరారయ్యాడు. రవి వెళ్లిపోయిన కొద్ది సేపటికి ఆమెను కాపాడిన వారే ఆమెపై అత్యాచారం చేశారు. అంతటి తో ఆగక మరో ముగ్గురు మిత్రులను ఘటనా స్ధలానికి పిలిచారు. వారి మిత్రులైన బ్రిజ్ కిషోర్, పీతాంబర్, ఉమేశ్‌లు కూడా వచ్చి ఆమెపై నీచానికి ఒడి గట్టారు. అనంతరం ఐదుగురు అక్కడి నుంచి పరారయ్యారు.
కాగా… సంఘటన జరిగిన పార్క్ బుధ్ధనగర్ పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరం లో ఉంది. ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని బాధితురాలి పోలీసు స్టేషన్ కు చేరుకుని జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించింది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా మొదట రవిని అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలు,రవి ఇచ్చిన ఆధారాలతో మరో ముగ్గురుని గురువారం అదుపులోకి తీసుకున్నారు. మిగిలిమన ఇద్దరి కోసం బుద్ధ నగర్ పోలీసులు గాలిస్తున్నారు. వారి సమాచారం అందించిన వారికి రూ. 25 వేల బహుమతి కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య నిలకడగా ఉంది.