బిహార్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 09:05 AM IST
బిహార్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

Updated On : May 2, 2019 / 9:05 AM IST

బిహార్‌లోని గయలో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వాహనాలను దగ్ధం చేశారు. జేసీబీ వాహనం, ఓ ట్రాక్టర్‌ దెబ్బ తిన్నాయి. బారాచట్టి ప్రాంతంలో రోడ్డు పనులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి పదిన్నర ప్రాంతంలో వచ్చిన మావోయిస్టులు నిద్రిస్తున్న వర్కర్స్‌ను లేపారు. వారిని గదిలో బంధించి,  డీజిల్‌, పెట్రోల్‌ పోసివ వాహనాలను తగులబెట్టినట్లు జేసీబీ డ్రైవర్‌ రాజీవ్‌కుమార్ తెలిపారు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం (మే1, 2019)న జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని శక్తిమంతమైన ఐఈడీ బాంబుతో మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో మొత్తం 15 మంది జవాన్లతోపాటు వాహన డ్రైవర్‌ ప్రాణాలొదిలారు. పక్కా ప్రణాళికతోనే మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.