ఆదృశ్యమైన వివాహిత మరో యువకుడితో ఆత్మహత్య

ఆదృశ్యమైన వివాహిత మరో యువకుడితో ఆత్మహత్య

Updated On : January 13, 2021 / 4:48 PM IST

married woman and lover suicide at hyderabad : అదృశ్యమైన మహిళ ప్రియుడితో కలిసి అతని ఇంటిలోఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. బర్కత్ పురా, చప్పల్ బజారులో నివాసం ఉండే ఓప్రైవేట్ ఉద్యోగి తన భార్య (23) ఈనెల 11వ తేదీన బయటకు వెళ్లి, తిరిగి ఇంటికిరాలేదని 12వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా ఆ మహిళ అదే ప్రాంతంలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన, ఆమె ప్రియుడు ఆటో డ్రైవర్ హనుమంతు(23) ఇంటికి వెళ్లింది. మంగళవారం రాత్రి హనుమంతు ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వెళ్లి చూడగా అక్కడ ఆదృశ్యమైన ప్రైవేట్ ఉద్యోగి భార్య కూడా ఆత్మహత్య చేసుకుని పడి ఉంది. ఆమె నిద్రమాత్రలు మింగి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకన్నారా… లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.