తప్పిపోయిన యువతి శవమై తేలింది

తప్పిపోయిన యువతి శవమై తేలింది

Updated On : December 16, 2020 / 3:29 PM IST

missing woman dead body found, in suryapeta district : బంధువుల ఇంటికి వచ్చిన యువతి తప్పిపోయింది.వారం రోజుల తర్వాత శవమై కనిపించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిమ్మాపురం గ్రామంలో చోటు చేసుకుంది. జిల్లాలోని అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికిచెందిన కునుకుంట్ల పావని అనే యువతి సూర్యాపేటలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది.

డిసెంబర్ 9వ తేదీన వారి ఇంటినుంచి కనిపించకుండా పోయింది. పావని తప్పిపోయన విషయమై కుటుంబ సభ్యులు సూర్యాపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు యువతి గురించి గాలింపు చేపట్టారు. కాగా తప్పిపోయిన యువతి బుధవారం తిమ్మాపురం గ్రామ శివారులోని పత్తి చేలో శవమై కనిపించింది.

సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డిఎస్పీ మోహన్‌కుమార్‌, నాగారం సీఐ శ్రీనివాసులు, అర్వపల్లి ఎస్సై మహేష్‌ ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

dead body suryapet