Kamareddy Deaths : తల్లీకొడుకు ఆత్మహత్య.. ఆ ఏడుగురు ఎక్కడ ?
ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మున్సిపల్ చైర్మన్‌కు వ్యతిరేకంగా ఫేస్‌బుక్ పోస్టు చేశాడు. ఇందులో సంతోష్ హస్తం ఉందని ఆయన్ను పోలీసులు పలుమార్లు విచారించారు. అయితే

Kamareddy
Kamareddy : కామారెడ్డి నడిబొడ్డున తల్లీకొడుకు.. ఓ హోటల్‌లో ఆత్మహత్య చేసుకోని 24 గంటలు గడిచిపోయింది..తమ చావుకు ఆ ఏడుగురు వ్యక్తులే కారణమంటూ వాళ్లు సెల్ఫీ వీడియోలో కూడా ప్రస్తావించారు.. ఆ ఏడుగురుపై పోలీసులు కేసు కూడా పెట్టారు.. కానీ వాళ్లెక్కడున్నారు…? 24 గంటలు గడిచినా పోలీసులు వాళ్లను ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు. కేసులో పొలిటికల్, పోలీస్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ రామయంపేట ఆత్మహత్యల కేసులో ఆ ఏడుగురు ఎక్కడ? నిజంగానే వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పోలీసులు ఏం చెబుతున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Read More : Kamareddy : తల్లి,కొడుకు ఆత్మహత్య..మా చావుకి ఆ ఏడుగురే కారణం
కామారెడ్డి జిల్లా రామయంపేట తల్లీకొడుకుల ఆత్మహత్య కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులుగా మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరితో పాటు పృథ్వీరాజ్, తోట కిరణ్, కృష్ణ గౌడ్, స్వరాజ్‌లపై కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటన జరిగినప్పటి నుంచి మృతులు సెల్ఫీ వీడియోలో పేర్కొన్న ఆ ఏడుగురు కనిపించడం లేదు. ఇప్పటి వరకు వారిని అదుపులోకి తీసుకోలేదు పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న సంతోష్, మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ ఇద్దరు పదేళ్లుగా మంచి స్నేహితులు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జితేందర్‌గౌడ్‌కు సంతోష్ రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేశాడు. కానీ మున్సిపల్ ఛైర్మన్‌గా గెలిచిన తర్వాత జితేందర్‌గౌడ్ ఏకంగా సంతోష్‌నే టార్గెట్ చేశాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో 50 శాతం వాటా ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇందుకు సంతోష్ ససేమిరా అనడంతో… మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడు. ఇలాంటి సమయంలోనే ఓ ఫేస్‌బుక్ పోస్టు ఈ రగడకు మరింత ఆజ్యం పోసింది.
Read More : Rats In Kamareddy Hospital : బాబోయ్ ఎలుకలు.. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో భయం, భయం
ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మున్సిపల్ చైర్మన్‌కు వ్యతిరేకంగా ఫేస్‌బుక్ పోస్టు చేశాడు. ఇందులో సంతోష్ హస్తం ఉందని ఆయన్ను పోలీసులు పలుమార్లు విచారించారు. అయితే అప్పటి రామాయంపేట సీఐగా పని చేసిన సీఐ నాగార్జునగౌడ్ తన ఫోన్‌లోని పర్సనల్ డేటా చోరీ చేసి… బ్లాక్ మొయిల్, ఇబ్బందులకు గురి చేశాడని సంతోష్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మృతులు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ స్విచ్‌ఆఫ్ పెట్టుకున్నాడు నాగార్జున గౌడ్. దీంతో అతడు ఎక్కడికి వెళ్లాడు, ఏ ప్రదేశంలో ఉన్నాడనే దానిపై సందిగ్ధత నెలకొంది. అయితే సీఐ తనతో టచ్‌లో ఉన్నారన్నారు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్. సాంకేతిక కారణాలతో సీఐ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమోనన్నారు ఎస్పీ.