Extramarital Affair : ఫేస్ బుక్ లో మహిళతో పరిచయం… ప్రమోషన్లు పోగోట్టుకున్న పోలీసు అధికారి

సోషల్ మీడియాలో పరిచయం అయిన మహిళతో చనువుగా ఉన్నాడో పోలీసు అధికారి ఆ పరిచయంతో మహిళ అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆ అధికారి ఉద్యోగంలో ప్రమోషన్లను, అవార్డులను పోగొట్టుకున్నాడు.

Extramarital Affair : ఫేస్ బుక్ లో మహిళతో పరిచయం… ప్రమోషన్లు పోగోట్టుకున్న పోలీసు అధికారి

Extramarital Affair

Updated On : May 21, 2021 / 5:44 PM IST

Extramarital Affair : సోషల్ మీడియాలో పరిచయం అయిన మహిళతో చనువుగా ఉన్నాడో పోలీసు అధికారి ఆ పరిచయంతో మహిళ అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఆ అధికారి ఉద్యోగంలో ప్రమోషన్లను, అవార్డులను పోగొట్టుకున్నాడు. మహారాష్ట్ర,ముంబైకి చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ ధన్ రాజ్ ప్రభాలే నాగపాద పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక మహిళ తన క్యాటరింగ్ వ్యాపారం గురించి వివరిస్తూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. అది చూసిన ధన్ రాజ్ ఆమహిళకు కేటరింగ్ బిజినెస్ లో సహాయం చేస్తానని చెప్పి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత నుంచి వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉండేవారు. అయితే ఇటీవల ఆ మహిళ ధన్ రాజ్ పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.  వ్యాపారంలో సహాయం చేస్తానని చెప్పి ధన్ రాజ్ తనను వాడుకున్నాడంటూ  ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కోంది.

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు ఆదేశించారు. విచారణలో ధన్ రాజ్ దోషిగా తేలాడు. దీంతో అధికారులు అతడికి ఏడాది పాటు ఇంక్రిమెంట్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ…‘‘ ఇది చాలా పెద్ద శిక్ష. ప్రమోషన్‌ విషయంలో భారీ దెబ్బ పడుతుంది. డీజీ ఇన్‌సిగ్నియా వంటి కొన్ని మెడల్స్‌ అందుకోవటానికి కూడా అతడు అనర్హుడు’’అని తెలిపారు.