అసలేం జరిగింది : మోడల్ పై రేప్ కేసులో ట్విస్ట్
హైదరాబాద్‌లో కలకలం రేపిన మోడల్ రేప్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఆ యువతిపై నిజంగానే అత్యాచారం జరిగిందా..? నిందితుల పేరెంట్స్ ఆరోపిస్తున్నట్లు డబ్బు కోసమే ఆ

హైదరాబాద్‌లో కలకలం రేపిన మోడల్ రేప్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఆ యువతిపై నిజంగానే అత్యాచారం జరిగిందా..? నిందితుల పేరెంట్స్ ఆరోపిస్తున్నట్లు డబ్బు కోసమే ఆ
హైదరాబాద్‌లో కలకలం రేపిన మోడల్ రేప్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఆ యువతిపై నిజంగానే అత్యాచారం జరిగిందా..? నిందితుల పేరెంట్స్ ఆరోపిస్తున్నట్లు డబ్బు కోసమే ఆ యువతి డ్రామాలాడుతోందా..? మోడల్ చెబుతున్నవన్నీ అబద్దాలేనా..? నిందితుల పేరెంట్స్ ఆరోపణల్లో నిజమేంత..? అసలు మోడల్‌పై అత్యాచారం కేసులో వాస్తవాలేంటి..?
హైదరాబాద్ మోడల్ గ్యాంగ్ రేపు కేసు కొత్త మలుపు తిరుగుతోంది. తెలంగాణ మిస్ మోడల్‌కు ప్రయత్నిస్తున్న ఓ యువతి…ఇద్దరు యువకులు తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఆ అఘాయిత్యాన్ని సెల్ ఫోన్‌లో రికార్డు చేశారని కంప్లైంట్ చేసింది. అయితే తాజాగా ఈ కేసులో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం యువతి డ్రామాలాడుతోందంటూ నిందితుల తల్లులు తెరపైకి వచ్చారు. బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతుందంటూ ఆరోపణలు చేశారు. దీంతో రేప్ కేసు కొత్త టర్న్ తీసుకుంది.
బాధిత యువతి 2019 డిసెంబర్ 28న తనపై అత్యాచారం చేశారంటూ పోలీసులను ఆశ్రయించింది. మొదట పోలీసులు కేసు నమోదు చేయకపోగా తనదే తప్పన్నట్లుగా చెప్తున్నారని యువతి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అన్యాయం జరుగుతోందని వాపోయింది. అయితే ఆ విషయం మీడియాలో ప్రసారం కావడంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఇక తన ఫిర్యాదు స్వీకరించిన తర్వాత పోలీసులు వెంటనే స్పందించారని బాధిత యువతి తెలిపింది. తనకు జరిగిన అన్యాయం మరో యువతికి జరగకూడదని అవేదన వ్యక్తం చేసింది. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంతో ముందుకొచ్చి ఫిర్యాదు చేశానని…ఇద్దరు వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ కన్నీరుమున్నీరైంది.
నిందితులను అరెస్ట్ చేయడంతో కేసు ఓ కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో…ఆ నిందితుల కుటుంబసభ్యులు తెరపైకి రావడంతో కేసు మరో మలుపు తిరిగింది. నిందితుల తల్లులు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. యువతి చెప్పేవన్నీ అబద్దాలేనని…డబ్బుల కోసమే డ్రామాలు ఆడుతోందని అన్నారు. రూ.20 లక్షలిస్తే కేసు వాపస్ తీసుకుంటానని యువతి చెప్పిందని ఆరోపించారు. తమ కుమారులను ట్రాప్ చేశారనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయని తేల్చి చెప్పారు. ఒక వేళ తమ పిల్లలు తప్పు చేశారని రుజువైతే కఠినంగా శిక్షించాలన్నారు.
మరోవైపు ఈ కేసులో నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు…బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుల కుటుంబసభ్యుల ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని…పూర్తి స్థాయి విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
* మోడల్‌పై అత్యాచారం కేసులో ట్విస్ట్
* యువతి చెప్పేవన్నీ అబద్దాలేనంటున్న నిందితుల కుటుంబసభ్యులు
* తమ కుమారులను ట్రాప్ చేసిందంటున్న నిందితుల తల్లులు
* డబ్బుల కోసమే డ్రామాలు ఆడుతోందని ఆరోపణ
* రూ. 20లక్షల ఇస్తేనే కేసు వాపస్ తీసుకుంటానని చెబుతోందని ఆరోపణ
* తమ వద్ద అన్ని ఆధారాలున్నాయంటున్న నిందితుల తల్లులు
Also Read : వరంగల్ ప్రేమోన్మాది దాడి ఘటనలో కొత్త కోణాలు : మాట్లాడాలని పిలిచి అత్యాచారం చేసి హత్య