Panjagutta Child : చిన్నారి హత్య..సవతి తల్లే చంపేసిందా ?

బాలికది హత్యేనని భావిస్తుండడంతో...ఎవరు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక కుటుంబ సభ్యులపై కూపీ లాగుతున్నారు.

Panjagutta Child : చిన్నారి హత్య..సవతి తల్లే చంపేసిందా ?

Panjagutta

Updated On : November 8, 2021 / 1:24 PM IST

Panjagutta Child Murder : పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడడం లేదు. అయితే..ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ముసుగు ధరించిన మహిళ ఆ చిన్నారి డెడ్ బాడీని పడేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఎక్కడో హత్య చేసిన అనంతరం ఆటోలో…వచ్చి మృతదేహాన్ని పడేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తికోసం చిన్నారిని సవతి తల్లే హత్య చేసిందా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

Read More : Skirts for Boys: స్కూల్‌కి స్కర్ట్స్ వేసుకొచ్చిన అబ్బాయిలు.. ఎందుకంటే?

ఆ చిన్నారి వివరాలు ఏమైనా తెలిస్తే…సమాచారం ఇవ్వాలని అన్ని పోలీస్ స్టేషన్ లకు తెలియచేశారు. పడేసిన మహిళ సవతి తల్లిగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే..పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. బాలిక మృతికి సంబంధించి పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. చిన్నారిది హత్యేనని ప్రాథమికంగా తేల్చారు. బాలిక కడుపులో బలంగా తన్నడం వల్లే.. చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. బాలిక కడుపు భాగంలో బలమైన గాయాలు కావడంవల్లే చనిపోయినట్టు పోస్టుమార్టం రిపోర్టులోనూ తేలింది. దీంతో బాలికది ముమ్మాటి హత్యేనన్న అభిప్రాయానికి వచ్చారు పోలీసులు.

Read More : Heavy Rains : ఏపీకి వర్ష సూచన..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

బాలికది హత్యేనని భావిస్తుండడంతో…ఎవరు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక కుటుంబ సభ్యులపై కూపీ లాగుతున్నారు. బాలికను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, చంపేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది, తెలిసిన వారే చంపేశారా, లేక మరెవరైనా మర్డర్‌ చేశారా అన్నదానిపై  విచారణ చేస్తున్నారు. మరోవైపు.. నగరంలోని సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఇప్పటివరకు రెండు వందలకు పైగా సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఓ వాహనం నెంబర్‌ను ట్రేస్ చేశారు. వాహనం నంబర్‌ ఆధారంగా ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఐదు రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం.. దర్యాప్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.