ఓటును ఫొటో తీసిన వ్యక్తి : కేసు నమోదు
వేసిన ఓటును సెల్ ఫోన్ తో ఫొటో తీసి, సోషల్ పెట్టిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వేసిన ఓటును సెల్ ఫోన్ తో ఫొటో తీసి, సోషల్ పెట్టిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జగిత్యాల : వేసిన ఓటును సెల్ ఫోన్ తో ఫొటో తీసి, సోషల్ పెట్టిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈఘటన ఆత్మకూర్ లో చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌కు చెందిన ఆర్.సాగర్.. జనవరి 25 శుక్రవారం రోజున గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశాడు. ఆ సమయంలో పోలింగ్ కేంద్రంలో తాను వేసే ఓటును రహస్యంగా సెల్ ఫోన్ తో ఫొటో తీశాడు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిపై ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శంకర్‌రావు తెలిపారు.