సెక్స్ కి ఒప్పుకోలేదని మోడల్ ని హత్య చేశాడు

  • Published By: venkaiahnaidu ,Published On : January 25, 2019 / 02:22 PM IST
సెక్స్ కి ఒప్పుకోలేదని మోడల్ ని హత్య చేశాడు

గతేడాది అక్టోబర్ లో ముంబైలో దారుణ హత్యకు గురైన మోడల్ మన్సీ దీక్షిత్ కేసులో పోలీసులు చార్జిషీటులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన్సీని హత్య చేసిన నిందితుడు, ఫొటొగ్రాఫర్ సయూద్ ముజమ్మిల్(19)  తనతో సెక్స్ కి నిరాకరించిందని ఆమెను హత్య చేసినట్లు పోలీసులు చార్జి షీటులో తెలిపారు. సయూద్ ముజమ్మిల్(19) ఫొటో షూట్ నెపంతో మన్సీని సయూద్ ముజమ్మిల్ తన రూమ్ కి  రప్పించుకున్నాడు.   మన్సీని తనతో సెక్స్ చేయాలని కోరాడు. దీనికి మన్సీ నిరాకరించింది. వెంటనే ఓ చెక్క కుర్చీతో మన్సీ తలపై బలంగా కొట్టాడంతో మన్సీ కోమాలోకి వెళ్లిపోయింది. కోమాలో ఉన్న మన్సీని రేప్ చేశాడని, అనంతరం ఆమె గొంతును తాడుతో బిగించి హత్య చేశాడని పోలీసులు చార్జి షీట్ లో తెలిపారు. మన్సీని హత్య చేసిన తర్వాత ఓ బ్యాగ్ లో ఆమె డెడ్ బాడీని కుక్కి క్యాబ్ లో తీసుకెళ్లి ముంబై శివార్లలోని ఓ చీకటి ప్లేస్ లో ఆ బ్యాగ్ ను పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అనుమానం వచ్చిన క్యాబ్ డ్రైవర్ బ్యాగ్ ను ఓపెన్ చేసి చూడగా అందులో డెడ్ బాడీ ఉండటంతో పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. దీంతో ముజమ్మిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.