విహారంలో విషాదం : రోడ్డు ప్రమాదంలో డాక్టర్ కుటుంబం మృతి

ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం దంతెవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా విజయనగరం వాసులుగా

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 05:52 AM IST
విహారంలో విషాదం : రోడ్డు ప్రమాదంలో డాక్టర్ కుటుంబం మృతి

Updated On : October 29, 2019 / 5:52 AM IST

ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం దంతెవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా విజయనగరం వాసులుగా

ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం దంతెవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా విజయనగరం వాసులుగా గుర్తించారు. మిమ్స్‌(Maharajah Institute of Medical Sciences) ఆసుపత్రి డాక్టర్‌ సునీత కుటుంబంగా పోలీసులు కనుగొన్నారు. విశాఖ నుంచి దంతెవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సోమవారం(అక్టోబర్ 28,2019) రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం విమ్స్‌లో అనాటమీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ సునీత కుటుంబీకులు ఏడుగురు రెండు రోజుల క్రితం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం జగదల్‌పూర్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్, పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ చూశాక అక్కడి నుంచి రైలుమార్గంలో దంతెవాడకు వచ్చారు. అక్కడ ఒక ప్రైవేట్ క్యాబ్‌ను మాట్లాడుకుని దంతెవాడ దంతేశ్వరీ ఆలయం, సమీపంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. 

ఈ క్రమంలో జగదల్‌పూర్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టును వీరు వెళ్తున్న వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ సునీత, ఆమె కుమార్తె శ్రేయ స్పాట్ లో చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. వీరిలో సునీత భర్త లక్ష్మణరావు, సోదరుడు వి.రమేష్ ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విజయనగరంలోని సీతంపేటకు చెందిన వి.త్రిమూర్తులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. సరదాగా విహారానికి వెళ్లిన డాక్టర్ కుటుంబంలో ఊహించని ప్రమాదం జరిగింది. డాక్టర్ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.