మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన ఘటనలో 10 మంది మరణించారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్తి చికిత్స అందిస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని రేవా వద్ద ఆగి ఉన్నలారీని వేగంగా వెళ్తున్నఒక ప్రయివేటు బస్సు ఢీ కొట్టటంతో ఈదుర్ఘటన జరిగింది. బస్సులో ముందు వైపు కూర్చున్న వారంతా సీట్ల మధ్య ఇరుక్కుని మరణించి నట్లు తెలుస్తోంది. బస్సు సిధ్ది నుంచి రేవా వెళుతుండగా ఈప్రమాదం జరిగింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. సమాచారం తెలుసుకున్నస్ధానికులు సహాయక చర్యలు చేపట్టారు.
Rewa: Five people have died and at least 7 have been injured in a collision between a truck and a bus. Injured have been admitted to hospital, rescue operations underway. #MadhyaPradesh pic.twitter.com/ytYR0oDc06
— ANI (@ANI) December 5, 2019