Agnipath Protest : సుబ్బారావును విచారిస్తున్నాం-నరసరావుపేట సీఐ
పల్నాడు జిల్లా నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును విచారిస్తున్నామని నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి చెప్పారు.

Avula Subba Rao
Agnipath Protest : కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో అభ్యర్ధులు చేరేందుకు తీసుకు వచ్చిన అగ్నిపథ్ పధకాన్ని నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసానికి సంబంధించి పల్నాడు జిల్లా నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును విచారిస్తున్నామని నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి చెప్పారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో సుబ్బారావు పాత్ర ఉందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సుబ్బారావు పాత్ర ఉందా లేదా అనేది విచారిస్తున్నామని ఆయన తెలిపారు. ఆందోళన జరిగిన సమయంలో తాను అక్కడలేనని సుబ్బారావు చెప్పాడని అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామని సీఐ చెప్పారు.
సెల్ ఫోన్ లో సుబ్బారావు విద్యార్ధులకు వాట్సప్ మెసేజ్ లు పంపించాడు. వాటి గురించి పరిశీలన చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు అకాడమీ ద్వారా రెండు వేల మంది అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇప్పించానని సుబ్బారావు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. సుబ్బారావు ద్వారా అగ్నిపథ్ ఆందోళనకు వెళ్లవద్దని అతని స్టూడెంట్స్ కు చెప్పిస్తున్నామని సీఐ భక్తవత్సల రెడ్డి చెప్పారు.
Also Read : Kerala : ఎస్సైపై కత్తితో దాడి-చాకచక్యంగా తప్పించుకుని నిందితుడ్ని పట్టుకున్న ఎస్సై