ఉద్రిక్తం : పోలీసులకు, లాయర్లకు మధ్య ఘర్షణ

  • Published By: chvmurthy ,Published On : November 2, 2019 / 11:12 AM IST
ఉద్రిక్తం : పోలీసులకు, లాయర్లకు మధ్య ఘర్షణ

Updated On : November 2, 2019 / 11:12 AM IST

ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు వద్ద శనివారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. వాహానం పార్కింగ్ చేసే విషయంలో పోలీసులకు, న్యాయవాదులకు చెలరేగిన వివాదం  మరింత ముదిరింది.  కాసేపటికి ఇది ఘర్షణగా మారింది.

ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్ తన సర్వీసు రివాల్వర్ తో కాల్పులు జరపటంతో వాతావరణం హీటెక్కింది. ఆందోళనకారులు ఒక పోలీసు వాహానానికి నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో  ఇద్దరు న్యాయవాదులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.  పరిస్ధితి ఆందోళన కరంగా మారటంతో  పోలీసులు కోర్టు గేట్లకు తాళం వేశారు. ఘర్షణ జరగటంతో కోర్టు వద్దకు  భారీగా  పోలీసు బలగాలను తరలించారు.