పోలీసులే షాక్ అయ్యారు : పొడి, ఫ్రేమ్స్ రూపంలో గోల్డ్ స్మగ్లింగ్

హైదరాబాద్‌: బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. పోలీసుల కళ్లు కప్పి రోజుకో పంథాలో దందా సాగిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 7, 2019 / 04:02 AM IST
పోలీసులే షాక్ అయ్యారు : పొడి, ఫ్రేమ్స్ రూపంలో గోల్డ్ స్మగ్లింగ్

Updated On : March 7, 2019 / 4:02 AM IST

హైదరాబాద్‌: బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. పోలీసుల కళ్లు కప్పి రోజుకో పంథాలో దందా సాగిస్తున్నారు.

హైదరాబాద్‌: బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. పోలీసుల కళ్లు కప్పి రోజుకో పంథాలో దందా సాగిస్తున్నారు. పలు రూపాల్లో గోల్డ్ ని  అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాజాగా జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ తీరు చూపి పోలీసులే షాక్ తిన్నారు. పొడి రూపంలో, ఫ్రేములుగా మార్చి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది.
Also Read: పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్

హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, శంషాబాద్‌ ఎయిర్ పోర్టు కస్టమ్స్‌ అధికారులు వేర్వేరుగా ఒకేరోజు ఛేదించిన 2 కేసులు ఈ విషయాన్ని బయటపెట్టాయి. ఇద్దరు హైదరాబాద్  వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు రూ.1.17 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అబ్దుల్‌ హైతమీన్‌కు షార్జాలో  ఉంటున్న సయ్యద్‌ అఫ్జల్‌ హుస్సేన్‌తో పరిచయం ఏర్పడింది. హుస్సేన్‌ గతంలో డ్రైవర్‌గా పని చేసి ప్రస్తుతం బంగారం స్మగ్లర్‌గా మారిపోయాడు.

హైతమీన్‌ను క్యారియర్‌గా మార్చి స్మగ్లింగ్‌కు శ్రీకారం చుట్టాడు. ఫిబ్రవరిలో షార్జా వెళ్లిన హైతమీన్‌ అక్కడ అఫ్జల్‌ సహకారంతో కొన్ని ప్రత్యేక దుకాణాల్లో 550 గ్రాముల బంగారాన్ని పేస్ట్‌ రూపంలోకి  మార్చాడు. సీల్డ్‌ కవర్‌లో ప్యాక్‌ చేసి ఉన్న దీన్ని రెండు యాంకిల్‌ బ్యాండ్స్‌లో ఏర్పాటు చేయించుకున్నాడు. వీటిని కాళ్లకు అమర్చుకుని, వాటిపై సాక్సు వేసుకుని షూ ధరించి శనివారం సిటీకి  వచ్చాడు. ఆ పేస్ట్ ని వేడి చేస్తే చాలు పసిడి యథాతథంగా బయటపడుతుంది. కనీసం గ్రాము కూడా తరుగు ఉండదు. బంగారం రూపు మార్చడానికి వ్యాపారులు రూ.16 వేలు చార్జ్‌ చేస్తున్నారు.  సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం హైతమీన్‌ ఇంటిపై దాడి చేశారు. పేస్ట్‌ రూపంలో ఉన్న బంగారం, పాస్‌పోర్ట్‌ స్వాధీనం చేసుకున్నారు. బంగారం అమ్మిన  తర్వాత వచ్చిన మొత్తాన్ని అఫ్జల్‌కు పంపిస్తానని, తనకు ఒక్కో ట్రిక్‌కు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఇస్తుంటాడని హైతమీన్‌ చెప్పాడు.

మరో కేసులో.. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్‌ వెళ్లాడు. బుధవారం తిరిగి వచ్చిన అతడు.. తనతోపాటు 4 ట్రాలీ బ్యాగ్స్‌ తీసుకొచ్చాడు. అతడి వ్యవహారశైలితోపాటు బ్యాగులపై  అనుమానం వచ్చిన కస్టమ్స్‌ అధికారులు అతడిని ఆపి తనిఖీలు చేశారు. అతడి దగ్గర బ్యాగుల్లో ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదు. అయితే 4 బ్యాగుల్ని తీసుకురావడంపై కస్టమ్స్‌  అధికారులు దృష్టి పెట్టారు. వాటిని అణువణువూ తనిఖీ చేశారు. ఆ ట్రాలీ బ్యాగ్స్‌కు ఉన్న ఫ్రేమ్‌లు, హ్యాండిల్, చక్రాలు బంగారంతో తయారైనట్లు గుర్తించారు.
Also Read: తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు : అమ్మను.. హల్వా పెట్టి చంపేశారు

దుబాయ్‌లో 3 కిలోల బంగారం ఖరీదు చేసిన సూత్రధారులు దాన్ని కొందరి సాయంతో ఇలాంటి వస్తువులుగా మార్చారని అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై స్టీల్,  ప్లాస్టిక్, అల్యూమినియం కోటింగ్స్‌ వేశారు. వీటిని ఆయా ట్రాలీ బ్యాగ్స్‌కు ఉన్న వాటితో రీప్లేస్‌ చేశారు. ఫ్రేమ్‌లు, హ్యాండిల్, చక్రాలను వేరు చేసి తూకం వేయగా 3 కేజీల బంగారం ఉన్నట్లు తేలింది.  దీని ధర మార్కెట్‌లో రూ.కోటి ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.
Also Read: ముషార్రఫ్ సంచలన నిజాలు : జైషే,ISIలు కలిసి భారత్ లో ఉగ్రదాడులు చేశాయి