అలర్ట్:  శ్రీలంకలో మళ్ళీ దాడులకు ప్లాన్ 

  • Published By: chvmurthy ,Published On : April 29, 2019 / 02:58 PM IST
అలర్ట్:  శ్రీలంకలో మళ్ళీ దాడులకు ప్లాన్ 

Updated On : April 29, 2019 / 2:58 PM IST

కొలంబో : ఈస్టర్  సండే రోజు జరిగిన  దాడులు తరహాలో శ్రీలంకలో మళ్లీ దాడులు చేసేందుకు ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధలు కుట్రపన్నినట్లు శ్రీలంక పోలీస్ డిపార్ట్ మెంట్ కు  చెందిన మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ హెచ్చరికలు జారీ చేసింది.  ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి. వ్యాన్, బాంబులను ఉపయోగించి మరో సారి భారీ పేలుళ్లు పాల్పడేందుకు అవకాశం ఉందని చెపుతూ…ప్రభుత్వం, ఇతర  భద్రతా విభాగాలకు  లేఖ రాసింది. 

ఈ దాడులు ఆది సోమ వారాల్లో జరిగే అవకాశం ఉందని , 5 ప్రాంతాల్లో దాడులకు అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కోన్నారు. అయితే ఆదివారం, సోమవారం సాయంత్రం వరకు  పేలుళ్లు జరగక పోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టంచేసి, సోదాలు జరిపి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.  ఈస్టర్ సండే  పేలుళ్ల తర్వాత కొలంబోలో విధించిన కర్ఫ్యూని ఆదివారం రాత్రి సడలించారు. కానీ సోదాలు కొనసాగుతున్నాయి.

ముస్లిం మహిళలు బురఖాలు ధరించటాన్ని నిషేధించారు. అయితే ఈసారి బౌధ్ద మందిరాలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని, ఉగ్రవాదుల తాజా టార్గెట్  లో బట్టికలోవా పట్టణం కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాగా….గత ఆదివారం ఇక్కడ చర్చిలో జరిగిన బాంబు పేలుడులో 27 మంది  ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ఉగ్రవాద సంస్థ నేషనల్ తవీత్ జమాత్ (ఎన్‌టీజే) ఈసారి దాడులకు  పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.