మిర్యాలగూడలో ఉద్రిక్తం: బాలుడి అనుమానాస్పద మృతి

  • Published By: chvmurthy ,Published On : January 26, 2019 / 11:06 AM IST
మిర్యాలగూడలో ఉద్రిక్తం: బాలుడి అనుమానాస్పద మృతి

Updated On : January 26, 2019 / 11:06 AM IST

నల్గొండ : మిర్యాలగూడ లోని రాజీవ్ నగర్ లో 2 ఏళ్ళ బాలుడు కార్తీక్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతికి పక్కింటివారే కారణమని ఆరోపిస్తూ మృతిపై విచారణ జరపాలని, అనుమానితుల ఇంటిముందు బాలుడి బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. పరిస్ధితి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి పరిస్ధితిని అదుపు చేసే క్రమంలో బాలుడి బంధువులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

జనవరి 25వ తేదీ మధ్యాహ్నం ఇంటి దగ్గర అడుకుంటున్నబాలుడు, సాయంత్రం సెప్టిక్ ట్యాంక్ లో శవమై కనిపించాడు. పక్క ఇంటివారే చంపి సెప్టిక్ ట్యాంక్ లో వేశారని బాలుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగానే బాలుడ్ని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. బాలుడి అంత్యక్రియలకు వచ్చిన బంధువులు, అనుమానితుల ఇంటిముందు ధర్నాకు దిగారు. దాడికి పాల్పడ్డారు. బాధిత కుటుంబాలకు పోలీసులు సర్దిచెప్పి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.