చూసుకోవాలి కదమ్మా: పాత పేపర్లలో పెట్టి బంగారం కూడా అమ్మేసింది

చూసుకోవాలి కదమ్మా: పాత పేపర్లలో పెట్టి బంగారం కూడా అమ్మేసింది

Updated On : November 23, 2019 / 8:28 AM IST

రాశిపురంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. గురువారం పాత పేపర్లతో పాటు రూ.5లక్షల విలువైన బంగారం, వజ్రాలతో కూడిన ఆభరణాలను మహిళ అమ్మేసింది. పొరబాటున పాత సామాను అమ్మేవ్యక్తికి విలువైన వస్తువులు అప్పగించేశానని తర్వాత తెలుసుకుంది. తేరుకుని అతని కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. 

బాధితురాలు ఘటన వివరించి పోలీసులను సహాయం చేయాలని కోరింది. రంగంలోకి దిగి సెకన్ల వ్యవధిలో అతణ్ని వెతికి పట్టుకున్నారు. రాశిపురంలోని విఘ్నేశ్ నగర్లో ఉంటున్న కళాదేవీ పాత సామాను కొనే వి.సెల్వరాజ్ అనే వ్యక్తికి ఇచ్చేసింది. కొద్ది గంటల తర్వాత అందులో మంగళసూత్ర, బంగారు గాజులు, రెండు వజ్రపు చెవుల రింగులు మొత్తం రూ.5లక్షల విలువైన వస్తులు ఉన్నాయి. 

గాలింపులో సెల్వరాజ్ షాపు నుంచి పోలీసులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. దొంగలు వస్తారనే భయంతో ఆ మహిళ బంగారు నగలను పాత పేపర్లలో దాచి ఉంచింది. అంతేకాకుండా సాధారణంగా బయటకు వెళ్లేటప్పుడు కూడా బంగారాన్ని పాత పేపర్లలో దాచి ఉంచడం మహిళకు అలవాటుగా మారింది. పోలీసులు పట్టుకున్న తర్వాత తన బంగారం తిరిగి అప్పగించిన సంతోషంలో ఆ వ్యక్తికి రూ.10వేల నగదును బహుమానంగా ఇచ్చింది.