మొగుడా ? రాక్షసుడా ? భర్త ఒత్తిడితో సూసైడ్ చేేసుకున్న భార్య

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను సూసైడ్ చేసుకోమని ఒత్తిడి చేయటంతో తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ అంబర్ పేట ఏరియాలో జరిగింది. మరో మహిళతో ఏర్పడిన అక్రమ సంబంధంతో కట్టుకున్న భార్యను సూసైడ్ చేసుకోమని ఒత్తిడి చేసి ఆత్మహత్య చేసుకోనేలా పురికొల్పాడు సుకీత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అంబర్ పేట 6వ నంబర్ ఏరియాలో ఉండే సుకీత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్, కార్వాన్ ప్రాంతానికి చెందిన శివాని అనే యవతిని 5 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
సుకీత్ కు కొన్నాళ్ల క్రితం మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇంట్లోని భార్యను చనిపోవాలని ఒత్తిడి చేయటం ప్రారంభించాడు. నువ్వు చచ్చిపోతే ఆమెను పెళ్లి చేసుకుంటానని వేధించసాగాడు. రాను, రాను ఈ వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. ఇటీవల కాలంలో సూసైడ్ చేసుకోమని భర్త నుంచి ఒత్తిడి ఎక్కువ అవటంతో, భర్త అక్రమ సంబంధం విషయాన్ని, తనను వేధిస్తున్న విషయాన్నీ శివానీ తన తల్లి తండ్రులకు చెప్పింది. ఇదిలా ఉండగా నవంబర్ 1వ తేదీ రాత్రి శివానీ ఆత్మహత్య చేసుకుందని శివానీ కుటుంబ సభ్యులకు సుకీత్ కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.
శివానీ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు అంబర్ పేట పోలీసు స్టేషన్ లో సుకీత్ పైనా అతడి కుటుంబ సభ్యులపై అంబర్ పేట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నవంబర్ 1వ తేదీ శుక్రవారం రాత్రి గం.8-45 సమయంలో తనతో సంతోషంగా మాట్లాడిందని, అమ్మకు చీర కొంటానని చెప్పిందని ఇంతలోనే సూసైడ్ చేసుకుందని సుకీత్ కుటుంబ సభ్యులు చెప్పటం పలు అనుమానాలను కల్పిస్తోందని శివానీ సోదరి తెలిపింది.