పంజాబ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

  • Published By: madhu ,Published On : May 10, 2019 / 02:31 AM IST
పంజాబ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

Updated On : May 10, 2019 / 2:31 AM IST

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాన్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా దసుయా సమీపంలోని ఉస్మాన్ షాహీద్ గ్రామానికి చెందిన వారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రార్థనా మందిరాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. 

వాహనాన్ని డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వీరికి ఎక్స్ గ్రేషియా అందిస్తున్నట్లు వెల్లడించారు. మృతి చెందిన కుటుంబానికి రూ. 1 లక్ష, గాయపడిన ఒక్కొక్కరికి రూ. 25వేలు అందిస్తామని ప్రకటించారు.