ఫేస్ బుక్ ఉందని బరితెగిస్తే ఎలా? : మహానేతను అవమానించి పారిపోయాడు

సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టి, ఇతరులను అవమానిస్తే వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెడుతున్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ప్రజలు.. కోందరి పట్ల తమకున్న వ్యతిరేకతను ప్రకటిస్తూనే ఉన్నారు. తమిళనాట సామాజిక సంస్కర్త పెరియార్ ఇ.వి.రామసామిని అవమానిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హరుర్ కు చెందిన కలై అరసన్ అనే వ్యక్తిపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు. పెరియార్ పుట్టినరోజు సందర్భంగా పెరియార్ పోస్టర్ ముందు ఆవు పేడను పెట్టి దానిపై కొవ్వోత్తులు వెలిగించి కేకును కత్తిరించాడు. అనంతరం పోస్టర్ కు చెప్పుల దండ వేసి, రామస్వామి చిత్రంపై కలై అరసన్ బురద జల్లాడు. ఇదంతా వీడియో తీసి తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశాడు. ఇది చూసిన ద్రవిడ కజగం సభ్యుడు వేడియాప్పన్ అనే కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించారు.
కలై అరసన్ పై 153 (ఎ) 1 (ఎ) (అసమానతను ప్రోత్సహించడం), 505 (1) (బి) (కారణం కలిగించే ఉద్దేశ్యం, లేదా ప్రజలకు కారణం, భయం లేదా అలారం కలిగించే అవకాశం) మరియు 505 (1) సెక్షన్ కింద కేసు నమోదైంది. ) (సి) భారతీయ శిక్షాస్మృతి యొక్క ఏదైనా తరగతి లేదా సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా నేరం చేయటానికి ప్రేరేపించే ఉద్దేశం, లేదా ప్రేరేపించే అవకాశం ఉంది) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నిందితుడు కలై అరసన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. కలైఅరసన్ బిజెపి సభ్యుడని తెలుస్తోంది. కానీ పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. కాగా పరారీలో ఉన్న కలై అరసన్ పెరియార్ రామస్వామిపై పోస్టు చేసిన వీడియోను తన ఫేస్ బుక్ పేజీ నుండి తీసివేశాడు.