హీరో రాజశేఖర్ కారు బోల్తా

  • Published By: venkaiahnaidu ,Published On : November 13, 2019 / 03:26 AM IST
హీరో రాజశేఖర్ కారు బోల్తా

Updated On : November 13, 2019 / 3:26 AM IST

టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రయాషిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలోకి రాజశేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి. హైద‌రాబాద్ కు విజ‌య‌వాడ‌ నుంచి వస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది దీంతో ఆయ‌న కారు మూడు ప‌ల్టీలు కొట్టిన‌ట్టు తెలుస్తుంది.

స‌మ‌యానికి బెలూన్స్ తెరుచుకోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింద‌ని స్థానికులు అంటున్నారు. రాజ‌శేఖ‌ర్‌తో పాటు మ‌రో వ్య‌క్తి కారులో ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా, ప్రమాదం తర్వాత రాజశేఖర్ మరో కారులో వెళ్లిపోయినట్టు సమాచారం. రాజశేఖర్‌తో పాటు ఉన్న మరో వ్యక్తి ఎలా ఉన్నాడు అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.