రెండు బైకులు చోరీ : దొంగలకు దేహశుద్ధి
కామారెడ్డి : బిక్కనూర్ మండలం జంగంపల్లిలో దొంగలు రెండు బైకులను చోరీ చేశారు. దొంగలకు స్తానికులు దేహశుద్ధి చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. జంగంపల్లిలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన భాస్కర్ శనివారం రాత్రి దివ్వ రెస్టారెంట్ ముందు TS 16 ED 1001 వాహనాన్ని నిలిపి భోజనం చేయడానికి వెళ్లి తిరిగి వచ్చే సరికి బైక్ మాయమైంది. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ ను దొంగిలించారు. దీంతో బాధితుడు రెస్టారెంట్ దృష్టికి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం బాధితుడు భాస్కర్ దివ్య రెస్టారెంట్ వద్ద కాపుకాశాడు.
అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు అదే బైక్ పై వచ్చి అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారిని ద్విచక్ర వాహనం పోగొట్టుకున్న బాధితుడు ప్రశ్నించాడు. వారు ఎదురెదురు మాట్లాడుతూ పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో స్థానికుల సహాయంతో వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. గతంలో దొంగతనాలు ఏమైనా చేశారా ? ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.