Uttar Pradesh : అనుమానం పెనుభూతం-77 ఏళ్ల వయస్సులో భార్యను హత్య చేసిన భర్త
భార్య శీలంపై అనుమానం పెనుభూతమయ్యింది. ఆయనకు 77 ఏళ్ళు వాళ్లావిడకు 66 ఏళ్లు ఈ వయస్సులో భార్య శీలంపై అనుమానం వచ్చిన వృధ్దుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.

New Project
Uttar Pradesh : భార్య శీలంపై అనుమానం పెనుభూతమయ్యింది. ఆయనకు 77 ఏళ్ళు వాళ్లావిడకు 66 ఏళ్లు ఈ వయస్సులో భార్య శీలంపై అనుమానం వచ్చిన వృధ్దుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.
ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాో అసోథర్ లో శివబరన్(75) భార్య లలితాదేవి(66) పిల్లలతో కలిసి కాపురం ఉంటున్నారు. ఇటీవలి కాలంలో భార్య లలితాదేవి ప్రవర్తన పట్ల శివబరన్ కు అనుమానం పెరిగింది. ఈ క్రమంలో ఆమె ఎక్కడకు వెళితే అక్కడకు వెళ్ళటం మొదలెట్టాడు. ఆమెను అనుమానించటం మొదలయ్యింది. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య ఇటీవల తరుచూ ఘర్షణలు జరుగుతున్నాయి.
ఈక్రమంలో బుధవారం రాత్రి వరండాలో నిద్రిస్తున్న భార్యను పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు. గురువారం ఉదయం రక్తపు మడుగులో లలితాదేవి పడిఉండటం చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు శివబరన్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్యపై అనుమానంతో తానే హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.
Also Read : Facebook love: ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి కొడుకు ఇజ్జత్ మొత్తం పోయింది..