Father Killed daughter : భార్యపై కోపంతో కూతుర్ని చంపిన భర్త

భార్యపై  కోపంతో కన్నకూతుర్ని ఊపిరాడకుండా చేసిన కసాయి తండ్రి ఉదంతం విజయవాడలో వెలుగుచూసింది. 

Father Killed daughter : భార్యపై కోపంతో కూతుర్ని చంపిన భర్త

Vijayawada Father Assasinated Daughter

Updated On : April 30, 2021 / 7:07 PM IST

Father Killed Daughter : భార్యపై  కోపంతో కన్నకూతుర్ని ఊపిరాడకుండా చేసిన కసాయి తండ్రి ఉదంతం విజయవాడలో వెలుగుచూసింది.  పాతబస్తీ  ప్రాంతం కొత్తపేటలో మాకిన వారి వీధిలో జగుపల్లి రాజా అనేవ్యక్తి భార్య యుగంధరి, ఏడేళ్ల కుమార్తె తో జీవిస్తున్నాడు.

గొల్లపూడిలోని హోల్ సేల్ మెడికల్ షాపులో రాజా పని చేస్తున్నాడు. మూడు నెలలనుంచి రాజా పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండటంతో ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయంపై  బుధవారం రాత్రి భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. వచ్చే ఆదివారం మే2 వ తేదీన పెద్దల సమక్షంలో చర్చించుకుందామని అనుకున్నారు. గురువారం ఉదయం ఆమె  కుమార్తెను తీసుకుని కొత్తపేటలోనే ఉన్న తన పుట్టింటికి వెళ్లిపోయింది.

కూతురుని  పంపమని రాజాఫోన్ చేయటంతో కుమార్తెను తీసుకుని ఇంటికి వచ్చి దింపి తిరిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సమయంలో రాజా భార్యపై ఉన్న కోపాన్ని కూతురిపై చూపిస్తూ పాప ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.

కొద్ది సేపటి తర్వాత యుగంధరి ఇంటికి వచ్చి చూసే సరికి పాప మంచంపై  అచేతనంగా  పడి ఉండటం చూసి నిశ్చేష్టురాలయ్యింది. వెంటనే స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజాను పోలీసులు అదుపులోకి సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారిస్తున్నారు.