రష్మిక మందనా డీప్‌ఫేక్ వీడియో.. నిందితుడిని ఎలా పట్టుకున్నారంటే..?
రష్మిక డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

what rashmika mandanna deepfake made accused say in police custody
rashmika mandanna deepfake: స్టార్ హీరోయిన్ రష్మిక మందనా డీప్‌ఫేక్ వీడియో కేసులో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈమని నవీన్ (24)గా గుర్తించారు. రష్మిక డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 500కు పైగా సోషల్ మీడియా ఎకౌంట్లను పరిశీలించారు. చివరకు నిందితుడిని ఏపీలో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. నిందితుడు డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే రష్మిక మందనా డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ చేసినట్టు తమ విచారణలో నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. రష్మిక అభిమాని అయిన అతడు.. రష్మిక ఫ్యాన్ పేజీ కూడా నడిపేవాడు. తాను క్రియేట్ చేసిన డీప్‌ఫేక్ వీడియోను ఈ పేజీలోనే ముందుగా షేర్ చేశాడు. ఈ వీడియో బాగా వైరల్ అయి తన పేజీకి ఫాలోవర్లు పెరుగుతారన్న ఆలోచనతోనే ఇదంతా చేశాడు.
Also Read: ప్రభాస్ జాతకం ఆయనకెలా తెలుసు?.. ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్..
అయితే ఈ వీడియోపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం కావడంతో చిక్కుల్లో పడతానని గుర్తించి.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పేరు మార్చేసి, ఆ వీడియోను డిలీట్ చేశాడు. అంతేకాదు తన డివైసెస్ లోని సంబంధిత డిజిటల్ డేటాను కూడా తొలగించాడు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో చివరకు అరెస్టయ్యాడు. చట్టప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం అక్రమ మార్గాలు ఎంచుకుంటే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరించారు.
Also Read: గుంటూరు కారం పాటకి సితార పాప డ్యాన్స్ చూసారా?