మొబైల్‌ పాస్‌వర్డ్‌ ఇవ్వలేదని భర్తను సజీవదహనం చేసిన భార్య 

మొబైల్‌ పాస్‌వర్డ్‌ ఇవ్వనందుకు భర్తకు భార్య నిప్పుపెట్టి సజీవదహనం చేసింది.

  • Published By: veegamteam ,Published On : January 19, 2019 / 03:27 PM IST
మొబైల్‌ పాస్‌వర్డ్‌ ఇవ్వలేదని భర్తను సజీవదహనం చేసిన భార్య 

Updated On : January 19, 2019 / 3:27 PM IST

మొబైల్‌ పాస్‌వర్డ్‌ ఇవ్వనందుకు భర్తకు భార్య నిప్పుపెట్టి సజీవదహనం చేసింది.

జకర్తా : ఇండోనేసియాలో ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. మొబైల్‌ పాస్‌వర్డ్‌ ఇవ్వనందుకు భర్తకు నిప్పుపెట్టి సజీవదహనం చేసింది. ఈ ఘటన ఇండోనేసియాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఇల్హామ్‌, డేడి పూర్ణమ భార్యాభర్తలు. భార్య ఇల్హామ్‌.. భర్త డేడి పూర్ణమను మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌ అడిగింది. అయితే పాస్‌వర్డ్‌ చెప్పడానికి అతను ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తురాలైన ఇల్హామ్‌ తన భర్త ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. అరుపులు విని చుట్టుపక్కల వారు అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇల్హామ్‌ను అరెస్ట్ చేశారు. గతంలో కూడా చిన్న చిన్న విషయాలపై ఇల్హామ్‌ కోపగించుకుని తన భర్తను హింసించేదని పోలీసులు తెలిపారు.