మూడో పెళ్లికి సిధ్ధమైన భర్త: కేసు పెట్టిన ఇద్దరు భార్యలు
మూడో పెళ్లికి సిధ్దమైన భర్త, ఒప్పుకోని భార్యలు,భర్తపై కేసు

మూడో పెళ్లికి సిధ్దమైన భర్త, ఒప్పుకోని భార్యలు,భర్తపై కేసు
హైదరాబాద్: రెండు పెళ్లిళ్లు చేసుకుని సక్రమంగా కాపురం చేసుకోక మూడో పెళ్లికి సిధ్దమయ్యాడు బోరబండకు చెందిన ఓప్రబుధ్ధుడు. పైగా తాను మూడో పెళ్లి చేసుకునేందుకు వాళ్లకేమి అభ్యంతరం లేదని సంతకం చేసి ఇవ్వాలని ఇద్దరు భార్యలపై ఒత్తిడి తెచ్చాడు. రెండో భార్య సంతకం చేయనని చెప్పటంతో ఆమె బాలింతరాలని కూడా చూడకుండా బెల్టుతో చావబాదాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి భర్తపై ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.