నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి లో మహిళా అనుమానాస్పద మృతి

woman : నిజామాబాద్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి లో ఆదివారం అర్థరాత్రి మార్చురీ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. రక్తపు మడుగులో మృతి చెందిన మహిళను నగరంలోని పాముల బస్తీకి చెందిన బుడగ జంగం మహిళ…. నూనె శైలజ గా గుర్తించారు. శైలజ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లినట్లు కుటుంబీకుల సమాచారం.
ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ ను రప్పించి అదారాల కోసం గాలిస్తున్నారు. మృతురాలికి భర్త సత్యానంద్ ముగ్గురు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా…మృతురాలి ఎడమ చేతిని దుండగులు నరికేసారు. భర్త పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.