Love Failure : మూడేళ్లు ప్రేమించి… వేరే యువతితో నిశ్చితార్థం…!

పెళ్లి చేసుకుంటానని చెప్పి మూడేళ్లపాటు ప్రేమించిన ప్రియుడు ఇప్పుడు వేరే యువతితో నిశ్చితార్ధం చేసుకోవటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల

Love Failure : మూడేళ్లు ప్రేమించి… వేరే యువతితో నిశ్చితార్థం…!

Girl Suicide

Updated On : September 29, 2021 / 1:12 PM IST

Love Failure : పెళ్లి చేసుకుంటానని చెప్పి మూడేళ్లపాటు ప్రేమించిన ప్రియుడు ఇప్పుడు వేరే యువతితో నిశ్చితార్ధం చేసుకోవటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఓదెల గ్రామానికి చెందిన అల్లం ప్రసన్న(21) హన్మకొండలో ప్రయివేట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రసన్న, అదే గ్రామానికి చెందిన రాంనేని సందీప్ అనే వ్యక్తి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన సందీప్ ఇటీవల వేరే యువతితో నిశ్చితార్ధం చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న ప్రసన్న సోమవారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. అది గమనించిన ఆమె తల్లితండ్రులు రమేశ్-సంధ్యలు ప్రసన్నను వెంటనే కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ ప్రసన్న సోమవారం రాత్రి మృతి చెందింది. ప్రసన్న మృతితో ఓదెల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మృతురాలి తల్లితండ్రుల ఫిర్యాదుతో రాంనేని సందీప్, అతని తల్లితండ్రులపై పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.