AP AHD Recruitment 2023 : ఏపీ పశుసంవర్ధక శాఖ లో 1896 ఉద్యోగాల భర్తీ
ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పేమెంట్ చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు వేతనంగా రూ.22,460 నుంచి రూ.72,810 చెల్లిస్తారు.

AP AHD Recruitment 2023
AP AHD Recruitment 2023 : ఏపీ పశుసంవర్ధక శాఖ(AHD)లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ (Animal Husbandry Assistant) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1896 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20న ప్రారంభమైంది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 11 గా నిర్ణయించారు.
అయితే దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ డిసెంబర్ 10గా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apaharecruitment.aptonline.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును డిసెంబర్ 27న విడుదల చేస్తారు. డిసెంబర్ 31న పరీక్ష నిర్వహిస్తారు.
జిల్లాల ఖాళీల వివరాలు ;
ప్రకాశం జిల్లా – 177
గుంటూరు జిల్లా – 229
కృష్ణా జిల్లా – 120
అనంతపురం జిల్లా – 473
చిత్తూరు జిల్లా – 100
కర్నూలు జిల్లా – 252
వైఎస్‌ఆర్ కడప జిల్లా – 210
నెల్లూరు జిల్లా – 143
పశ్చిమ గోదావరి జిల్లా – 102
తూర్పు గోదావరి జిల్లా – 15
విశాఖపట్నం జిల్లా – 28
విజయనగరం జిల్లా – 13
శ్రీకాకుళం జిల్లా – 34
మొత్తం ; 1896 ఖాళీలు
READ ALSO : DMK Support Congress in TS Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన డీఎంకే
అర్హతలు :
అభ్యర్థులు యానిమల్ హజ్బెండరీ విభాగంలో రెండేళ్ల పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే డెయిరీ అండ్ పౌల్ట్రీ విభాగంలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు లేదా పౌల్ట్రీ విభాగంలో రెండేళ్ల డిప్లొమా లేదంటే డెయిరీ విభాగంలో రెండేళ్ల ఇంటర్మీడియల్ కోర్సు లేదా బీఎస్సీ (డెయిరీ సైన్స్), ఎంఎస్సీ (డెయిరీ సైన్స్), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), డిప్లొమా వెటర్నరీ సైన్స్, డెయిరీ ప్రాసెసింగ్‌లో డిప్లొమా , డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ తదితర కోర్సులు చేసి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
వయోపరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
READ ALSO : Election Commission of India : కాంగ్రెస్, బీజేపీ ఫిర్యాదుతో ఈసీ కీలక నిర్ణయం
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పేమెంట్ చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు వేతనంగా రూ.22,460 నుంచి రూ.72,810 చెల్లిస్తారు.
READ ALSO : Budhni Mejhan : జవహర్‌లాల్ నెహ్రూ కారణంగా జీవితాంతం బహిష్కరణ ఎదుర్కొన్న గిరిజన మహిళ మృతి
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు రుసుము రూ1000. SC/ST/PH/ExService పురుషులకు దరఖాస్తు రుసుము రూ500.
దరఖాస్తు విధానం ;
ముందుగా apaha-recruitment.aptonline.in అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
హోమ్‌పేజీలో, రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
దరఖాస్తు రుసుము చెల్లించాలి.
READ ALSO : Uttar Pradesh : జీన్స్,టీ షర్ట్ ధరించాలని అత్తగారు వేధిస్తోంది అంటూ కోడలు ఫిర్యాదు
తరువాత దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి.
అవసరమైన అన్ని వివరాలను, పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
తరువాత దరఖాస్తు ఫారమ్‌ను సబ్ మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాలకోసం ప్రింట్ తీసుకోని పెట్టుకోవాలి.