ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం.. మార్చి 6వ తేదీ వరకు నిర్వహణ.. ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు

టెట్ పరీక్షకు మొత్తం 2,67,559 మంది దరఖాస్తు చేసుకోగా, వీరు పరీక్షలు రాసేందుకు 120 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం.. మార్చి 6వ తేదీ వరకు నిర్వహణ.. ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు

Exams 2024

Updated On : February 27, 2024 / 11:22 AM IST

AP TET Exams 2024 : ఏపీలో ఇవాళ్టి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 6వ తేదీ వరకు జరగనున్నాయి. రెండు సెషన్లలో టెట్ పరీక్షల నిర్వహణ ఉంటుందని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్ లో పరీక్షలు ఉంటాయని, అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సూచించారు.

Also Read : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ సర్కార్ రెండు గ్యారెంటీ స్కీంల ప్రారంభంలో ట్విస్ట్

పొరుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు..
టెట్ పరీక్షకు మొత్తం 2,67,559 మంది దరఖాస్తు చేసుకోగా, వీరు పరీక్షలు రాసేందుకు 120 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో మూడు (కర్మన్‌ఘాట్ -హైదరాబాద్, దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజ్ – ఖమ్మం, సనా ఇంజినీరింగ్ కళాశాల – కోదాడ) పరీక్షా కేంద్రాల్లో, కర్నాటకలో మూడు (తీగలపాళ్య ప్రధాన రహదారి – బెంగళూరు, బయోటెక్ సొల్యూషన్స్ – బెంగుళూరు), అరైజ్ టెక్నాలజీస్ సెంటర్ 1, బెంగళూరు) పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా తమిళనాడులో రెండు ( కోవిలంబాక్కం -చెన్నై, S.I.V.E.T కళాశాల – చెన్నై). ఒడిశాలో రెండు ( ఖిల్లికోట్ కళాశాల ప్రాంతం – బరంపురం), SMIT డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల (బరంపురం) పరీక్షా కేంద్రాల్లో ఏపీ విద్యాశాఖ టెట్ పరీక్షలు నిర్వహిస్తుంది.

Also Read : Rajya Sabha polls : రాజ్యసభ ఎలక్షన్స్.. ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో క్రాస్ ఓటింగ్ టెన్షన్..

14న తుది ఫలితాలు .. 
ఈ పరీక్షల పర్యవేక్షణకు 26 మంది సీనియర్ అధికారులను విద్యాశాఖ నియమించింది. పరీక్షా కేంద్రాల తనిఖీకి 29 మంది ఫ్లెయింగ్ స్వ్కాడ్ లు ఏర్పాటు చేశారు. గర్భిణీ అభ్యర్థులందరికీ సమీప పరీక్షా కేంద్రాలలో హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. 10వ తేదీన ప్రాథమిక కీ, 14వ తేదీన తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

పరీక్షా తేదీలు.. వివరాలు..
పేపర్ 1A : 27వ తేదీ నుంచి మార్చి నెల 1వ తేదీ వరకు.
పేపర్ 2A: మార్చి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు, 6వ తేదీన.
పేపర్ 1B : మార్చి 5వ తేదీన (FN)
పేపర్ 2B : మార్చి 5వ తేదీన (AN)