ESIC Recruitment : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పారామెడికల్ పోస్టుల భర్తీ

రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం ఫీజు రాయితీ ఇతరులకు వర్తిస్తుంది.

ESIC Recruitment : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పారామెడికల్ పోస్టుల భర్తీ

Recruitment of Paramedical Posts

Updated On : October 4, 2023 / 1:18 PM IST

ESIC Recruitment : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలంగాణా పరిధిలో పారామెడికల్‌ స్టాఫ్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Chilli Crop : మిరపలో కొమ్మకుళ్లు తెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఖాళీల వివరాలకు సంబంధించి ఈసీజీ టెక్నీషియన్స్ 8, జూనియర్ రేడియోగ్రాఫర్ 27, జూనియర్ మెడికల్ లేబరెటరీ టెక్నాలజిస్టు 13, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ 1, ఓటీ అసిస్టెంట్ 15, ఫార్మశిస్టు 1, రేడియో గ్రాఫర్ 2, సోషల్ వర్కర్ 3 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్ ను కలిగి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు. అభ్యర్ధుల వయసు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి.

READ ALSO : Prawn Cultivation : శీతాకాలంలో వనామి రొయ్యలకు వైట్ స్ఫాట్, విబ్రియో ఉధృతి

రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం ఫీజు రాయితీ ఇతరులకు వర్తిస్తుంది.

READ ALSO : Amazing Health Benefits : పాలల్లో నెయ్యి కలుపుకుని తాగటం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసా ?

ఆన్ లైన్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.esic.gov.in పరిశీలించగలరు.