Mohan T Advani Scholarship 2025: ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. లక్ష స్కాలర్షిప్ పొందే అవకాశం.. దరఖాస్తుకు ఇదే చివరి అవకాశం
Mohan T Advani Scholarship 2025: మోహన్ టీ అద్వానీ గారి శతజయంతి సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు.

Mohan t Advani scholarship program 2025
మీరు ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ లేదా డిప్లొమా చదువుతున్నారా? ఫీజుల గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే మీ కోసమే బ్లూ స్టార్ ఫౌండేషన్ ఒక అద్భుతమైన అవకాశం అందిస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు మోహన్ టీ అద్వానీ గారి శతజయంతి సందర్భంగా, ప్రతిభావంతులైన విద్యార్థులకు మోహన్ టీ అద్వానీ శతాబ్ది స్కాలర్షిప్ ప్రోగ్రాం 2025 ద్వారా రూ.1,00,000 వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ గొప్ప అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ యాజమాన్యం కోరింది. దానికి సంబందించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. .
ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హతలు:
విద్యార్హతలు: ఇంజినీరింగ్/ఆర్కిటెక్చర్/డిప్లొమా (1వ & 2వ సంవత్సరం) చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
ఆదాయ పరిమితి: కుటుంబ వార్షిక ఆదాయం ₹6 లక్షలకు మించకూడదు
ఆర్థిక సహాయం: డిగ్రీ విద్యార్థులకు లక్ష రూపాయలు, డిప్లొమా వారికి నలభై వేల రూపాయల ఆర్ధిక సహాయం అందుతుంది.
చివరి తేదీ: 15 జూలై 2025
ఈ స్కాలర్షిప్ ఎవరి కోసం? పూర్తి అర్హతా ప్రమాణాలు:
మొదటి సంవత్సరం విద్యార్థులు: 10వ తరగతి, ఇంటర్మీడియట్ రెండింటిలోనూ కనీసం 80% మార్కులు సాధించి ఉండాలి.
రెండవ సంవత్సరం విద్యార్థులు: ఇంటర్లో 80% మార్కులతో పాటు, ఇంజినీరింగ్/డిప్లొమా మొదటి సంవత్సరంలో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి.
ఈ స్కాలర్షిప్ కేవలం మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ బ్రాంచ్‌ల విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది
ముఖ్య గమనిక: సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు కారు.
ఈ డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు లేదా మీ కాలేజీకి బదిలీ చేయబడుతుంది.
దరఖాస్తు ఇలా చేసుకోవాలి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక లింక్ www.b4s.in/xmes/BSFS4 లోకి వెళ్ళాలి
- అందులో “Apply Now” బటన్‌పై క్లిక్ చేయాలి
- మీ ఈమెయిల్, ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫామ్‌లో వ్యక్తిగత, విద్యా, కుటుంబ వివరాలను ఎంటర్ చేయాలి
- అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
- తరువాత దరఖాస్తును సబ్మిట్ చేయండి.