ఐఐటీ హైదరాబాద్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

హైదరాబాద్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా టెక్నికల్, నాన్ టెక్నికల్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 152 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులను రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
విభాగాల వారీగా ఖాళీలు :
– రిజిస్ట్రార్ – 1
– చీఫ్ లైబ్రరీ ఆఫీసర్ – 1
– డిప్యూటీ రిజిస్ట్రార్ – 2
– ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 1
– టెక్నికల్ ఆఫీసర్ (గ్రేడ్-2) – 1
– అసిస్టెంట్ లైబ్రేరియన్ – 1
– నెట్ వర్క్, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ – 2
– అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) – 1
– స్పోర్ట్స్ ఆఫీసర్ (గ్రేడ్ -1) – 5
– మెడికల్ ఆఫీసర్(గ్రేడ్-1) – 1
– లేడి మెడికల్ ఆఫీసర్(గ్రేడ్ -1) – 1
– టెక్నికల్ ఆఫీసర్ (గ్రేడ్ -1) – 2
– అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 4
– బయో సేఫ్టి ఆఫీసర్ – 1
– వెటర్నరీ డాక్టర్ – 1
– సైకలాజికల్ కౌన్సెలర్ – 1
– అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) – 3
– అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) -1
– ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ – 18
– లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 2
– హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ అసిస్టెంట్ – 2
– ఫిజియోథెరపిస్ట్ – 1
– ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ – 1
– లేడి ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ – 1
– జూనియర్ ఇంజనీర్(సివిల్) – 3
– జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) – 2
– జూనియర్ అకౌంటెంట్ – 6
– జూనియర్ అసిస్టెంట్ – 2
– జూనియర్ టెక్నిషియన్ – 36
– మల్టీ స్కిల్ అసిస్టెంట్(గ్రేడ్-1) – 22
– టెక్నికల్ సూపరింటెండెంట్ – 26
విద్యార్హత :
అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగాల్లో అనుభవం కలిగి ఉండాలి.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 23, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 17, 2020.